Share News

ప్రజలకు మరింత చేరువ కావాలి

ABN , Publish Date - Mar 29 , 2024 | 12:02 AM

ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసులు విధులు నిర్వర్తించాలని ఎస్పీ రితి రాజ్‌ అన్నారు.

ప్రజలకు మరింత చేరువ కావాలి
బాధితులతో మాట్లాడుతున్న ఎస్పీ రితిరాజ్‌

- ఎస్పీ రితిరాజ్‌

- శాంతినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ తనిఖీ

- ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ

వడ్డేపల్లి, మార్చి 28 : ప్రజలకు మరింత చేరువయ్యేలా పోలీసులు విధులు నిర్వర్తించాలని ఎస్పీ రితి రాజ్‌ అన్నారు. బాధితులకు సత్వర న్యాయం జరుగు తుందన్న భరోసా కల్పించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. శాంతినగర్‌ పోలీస్‌ స్టేషన్‌ను గురువారం ఆమె తనిఖీ చేశారు. స్టేషన్‌లో రికార్డులను పరిశీలించి, సీఐ రత్నంతో మాట్లాడి పెండింగ్‌ కేసుల వివరాలు తెలుసుకున్నారు. అనంతరం 13 మంది నుంచి ఫిర్యాదు లను స్వీకరించారు. ప్రతీ ఫిర్యాదుపై పకడ్బందీగా విచారణ చేపట్టి చట్ట ప్రకారం కేసులను పరిష్కరిం చాలని సీఐ, ఎస్‌ఐలను ఆదేశించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ నాన్‌ గ్రీవెన్స్‌ కేసుల్లో సాక్ష్యాధారాలను సేకరించి, పకడ్బందీగా విచారణ పూర్తి చేయాలన్నారు. కోర్టుల్లో చార్జిషీట్‌ వేసిన కేసులకు వెంటనే సీసీ నెంబర్లు పొందాలన్నారు. కేసులను ఛేదించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్‌ఐని ఆదేశించారు. ప్రాపర్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని, పని చేయని సీసీ కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటును ప్రోత్సహించేలా ప్రజలతో చర్చించాలన్నారు. మునిసిపాలిటీల పరిధిలోని కాలనీ వాసులతో మాట్లాడి, ఎంట్రన్స్‌ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాలని సూచించారు. గతంలో నమో దైన కేసులు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలని, విచారణ పెండింగ్‌లో ఉండటానికి కారణాలను పరిశీ లించాలని ఆదేశించారు. స్టేషన్‌ పరిధిలో ఎన్ని బీట్స్‌ ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. సక్రమంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తూ, దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎస్పీ కే.సత్యనారాయణ, ఎస్‌ఐ సంతోష్‌, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:02 AM