Share News

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:52 PM

గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్‌ వేతనాలను చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయితీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తిక్‌ అన్నారు.

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి
కలెక్టరేట్‌ ముందు నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న కార్తీక్‌

- ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తీక్‌

గద్వాల న్యూటౌన్‌, జూలై 5 : గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్‌ వేతనాలను చెల్లించాలని తెలంగాణ గ్రామ పంచాయితీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి జమ్మిచేడు కార్తిక్‌ అన్నారు. పట్టణంలోని కలెక్టరేట్‌ ముందు శుక్రవారం కార్మికులు నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రెండు నుంచి ఎనిమిది నెలలుగా జీతాలు రాకపోవడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటును కేటాయించి వేతనాలు ఇవ్వాలన్నారు. లేకపోతే కలెక్టర్‌ ప్రత్యేక నిధుల నుంచైనా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మల్టీపర్పస్‌ వర్కర్లను వెంటనే పర్మినెంట్‌ చేయాలని కోరారు. అనంతరం కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రం ఇచ్చారు. ధర్నాలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు హరీశ్‌, నాయకులు శ్రీనివాస్‌, ఐఎఫ్‌ టీయూ జిల్లా అధ్యక్షుడు మధు. కార్మికులు బజారమ్మ, తాయమ్మ, సుజాతమ్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 10:52 PM