పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ABN , Publish Date - Jul 05 , 2024 | 10:35 PM
గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు బి.నరసింహా, రాము అన్నారు.

నారాయణపేట టౌన్, జూలై 5 : గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు బి.నరసింహా, రాము అన్నారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు నాయకులు నిరసన ర్యాలీని నిర్వహించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నాయ కులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 12వేల పైచిలుకు గ్రామ పంచాయతీ కార్మికులు తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారన్నారు. కనీస వేతనం రూ.9500 ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే జీపీ కార్మికులకు ప్రతీనెల ఐదో తేదీన వేతనాలు అందించాలన్నారు. గత ఐదు నెలల పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ రాణప్రతాప్‌కు అప్ప గించారు. కార్యక్రమంలో బుట్టో, రామాంజ నేయులు, ప్రశాంత్, నారాయణ, సుశాంత్, తాయప్ప, కొండప్ప, రాజప్ప, రాంచందర్, భీములు, మహాదేవ్, పరుశరాం తదితరులున్నారు.