Share News

పెండింగ్‌ కేసులు సత్వరమే పరిష్కరించాలి

ABN , Publish Date - Jan 17 , 2024 | 10:34 PM

పెండింగ్‌ కేసులు సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు.

పెండింగ్‌ కేసులు సత్వరమే పరిష్కరించాలి

- నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

నారాయణపేట, జనవరి 17 : పెండింగ్‌ కేసులు సత్వరమే పరిష్కరించాలని ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ అన్నారు. బుధవారం జిల్లాలోని వివిధ పోలీస్‌ అధికారులు, డీఎస్పీలు, సీఐ, ఎస్‌ఐలతో వీసీ ద్వారా నెలవారి నేర సమీక్షా సమావేశం నిర్వహించి, మాట్లాడారు. పీఎస్‌లలో పెండింగ్‌లోని కేసుల వివరాలను, యూఐ కేసులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తమ పరిధిలో జరిగే నేరాలలో పకడ్బందీ విచారణ చేసి నిందితులపై కఠినంగా వ్యవహరించాలని, కేసుల విచారణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. ప్రతీ కేసులో సమగ్ర విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేసేలా పని చేయాలని, కేసు విచారణలో ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ చేసుకొని పకడ్బందీగా విచారణ చేపట్టాలన్నారు. స్టేట్‌మెంట్‌ రికార్డు, సీడీఎఫ్‌ ఫీల్‌ చేయడం, ఫొటోలు, ఆస్తులు, నిందితుల వివరాలు నమోదు చేయడం, రిమాండ్‌ డైరీ, చార్జిషీట్‌ ఫిల్‌ చేయడం తదదితర అంశాలపై ఎస్పీ సూచనలు చేశారు. ప్రజలకు రోడ్డు నియమాలు, ట్రాఫిక్‌, రోడ్‌ సేప్టీ గురించి అవగాహన కల్పించాలని, గుర్తించిన హాట్‌ స్పాట్‌లలో ప్రమాదాలు జరుగకుండా ఆర్‌అండ్‌బీ వారితో మాట్లాడి సిగ్నల్స్‌, ఇతర మార్పులు చేర్పులు చేపట్టాలన్నారు. కళా బృందాల ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతీ శనివారం పరేడ్‌ నిర్వహంచి సిబ్బందికి సమావేశం ఏర్పాటు చేసి విధుల పట్ల అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేయాలన్నారు. కమ్యూనిటీ కాంటాక్ట్‌ పోగ్రాం నిర్వహించాలని, పీఎస్‌లలో పట్టుబడిన వాహనాలకు వేలం నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి న్యాయ అధికారులతో సమన్వయం పాటిస్తూ నేరస్తులకు శిక్షలు పడేలా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. బ్లూ కోల్ట్స్‌, పెట్రోలింగ్‌ సిబ్బంది తమ విధులను ఖచ్చితంగా చేయాలని, వర్టికల్స్‌కు సంబంధించి సిబ్బంది పని తీరును రోజు వారిగా సమీక్షించుకోవాలని ఎస్‌ఐలకు ఎస్పీ సూచించారు. సీసీ కెమెరాల ప్రాధాన్యత గురించి ప్రజలకు వివరించి వాటిని ఏర్పాటు చేసుకునేలా కృషి చేయాలని, పీఎస్‌లో పరిసరాలు శుభ్రంగా ఉంచు కోవడం, ఫైళ్లను క్రమ పద్ధతిలో అమర్చు కోవడం వంటివి ఖచ్చితంగా పాటించాలని ఎస్పీ ఆదేశించారు. సమీక్షలో డీఎస్పీలు సత్యనారాయణ, వెంకటేశ్వర రావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు..

Updated Date - Jan 17 , 2024 | 10:34 PM