పెబ్బేరు అభివృద్ధికి కాపలాదారుడిగా పని చేస్తా
ABN , Publish Date - Sep 24 , 2024 | 11:27 PM
ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన మండల ప్రజలకు కాపలాదారుగా ఉండి పెబ్బేరు అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు.
- వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పెబ్బేరు, సెప్టెంబరు 24: ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన మండల ప్రజలకు కాపలాదారుగా ఉండి పెబ్బేరు అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. పెబ్బేరు మార్కెట్ యా ర్డులో జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్‌ల ప్ర మాణ స్వీకారంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంతగా అభిమానం చూపే పెబ్బేరు మండల ప్రజలను గుండెల్లో పెట్టి చూసుకుంటానని కబ్జాకు గురైన సంత స్థలాన్ని తాను కాపలాదారుడిగా ఉండి 30ఎ కరాల 22గుంటల భూమిని కాంపౌండ్ వాల్ నిర్మా ణం చేస్తానన్నారు. కొత్తగా మార్కెట్ యార్డుకు ఎంపికైన చైర్మన్, వైస్‌చైర్మ న్ , డైరెక్టర్లు అందరూ కలిసి మార్కె ట్ అభివృద్ధికి కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్స న్ కరుణశ్రీ, మార్కెట్ చైర్మ న్, వైస్‌చై ర్మన్ ఎద్దుల విజయవర్దన్ రెడ్డి, జిల్లా మార్కెట్ యార్డు అధికారి సురంజిత్ సింగ్, వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, వనపర్తి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్కి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీపీ ప్రభావతమ్మ, శ్రీరంగాపురం సింగిల్‌విండో అధ్యక్షు డు జగన్నాథంనాయుడు, మండల కాంగ్రెస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ సాగర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకట రాములు, కాంగ్రెస్ నాయకులు సురేందర్ గౌడ్, రంజిత్‌కుమార్, గంధం రాజశేఖర్, దయాకర్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, షకీర్ , శ్రీరంగాపురం మం డల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి, రాజు, మాజీ సర్పంచ్ రాజశేఖర్‌గౌడ్, మునిసిపల్ కౌన్సి లర్లు, మార్కెట్ డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.