Share News

ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు

ABN , Publish Date - Mar 26 , 2024 | 11:34 PM

జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసా గుతున్నాయని అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు అన్నారు.

ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు
పరీక్ష కేంద్రం అధికారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు

- అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు

- పదవ బెటాలియన్‌లోని పరీక్ష కేంద్రం తనిఖీ

ఎర్రవల్లి/ఉండవల్లి/గద్వాల టౌన్‌, మార్చి 26 : జిల్లా వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా కొనసా గుతున్నాయని అదనపు కలెక్టర్‌ ముసిని వెంకటేశ్వర్లు అన్నారు. ఎర్రవల్లి మండలంలోని పదో బెటాలియన్‌లో ఉన్న పరీక్ష కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మి కంగా తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందితో మాట్లా డారు. పరీక్షలు కొనసాగుతున్న తీరును తెలుసుకు న్నారు. అనంతరం మాట్లాడుతూ మిగిలిన రెండు పరీక్షలు కూడా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని తెలిపారు. ఆయన వెంట చీఫ్‌ సూపరింటెండెంట్‌ సోమశేఖర్‌రెడ్డి, సిట్టింగ్‌ స్క్వాడ్‌ ఉదయ్‌కిరణ్‌, కస్టోడియన్‌ సువార్త ఉన్నారు. ఉండ వల్లి మండలంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో 419 విద్యార్థులకు గాను ప్రాథమిక పాఠశాల పరీక్ష కేంద్రం లో ఒకరు గైర్హాజరు అయినట్లు పరీక్ష నిర్వహణాధికారి శ్రీనివాసులు తెలిపారు. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ రాజు తనిఖీ చేశారు. ఎస్‌ఐ శ్రీనివాసులు నాయక్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

7,248 మంది హాజరు

జిల్లా వ్యాప్తంగా 41 కేంద్రాల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షల్లో భాగంగా ఐదవ రోజు మంగళవారం నిర్వహించిన ఫిజికల్‌ సైన్స్‌ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 7,248 (96 శాతం) మంది హాజరయ్యారు. రెగ్యులర్‌ విభాగంలో 7,203 మందికి గాను 7,172 మంది పరీక్ష రాశా రు. 31 మంది గైర్హాజరయ్యారు. 83 మంది ప్రైవేట్‌ విద్యా ర్థులకు గాను 76 మంది పరీక్ష రాశారు. ఏడుగురు పరీక్ష రాయలేదు. మొత్తంగా 39 మంది పరీక్షకు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్ష ప్రశాంతంగా కొనసాగినట్లు చెప్పారు.

Updated Date - Mar 26 , 2024 | 11:34 PM