Share News

దారి దోపిడీ పార్థీ గ్యాంగ్‌ పనే

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:54 PM

వనపర్తి జిల్లా, పెబ్బేరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఈ నెల 18వ తేదీ బుధ వారం తెల్లవారు జామున దారి దొపిడీకి పాల్ప డింది పార్ధీ గ్యాంగ్‌ పనే అని మల్టీజోన్‌ 2 ఐజీ సత్య నారాయణ తెలిపారు.

దారి దోపిడీ పార్థీ గ్యాంగ్‌ పనే
సమావేశంలో మాట్లాడుతున్న మల్లీజోన్‌ 2 ఐజీ సత్యనారాయణ, పక్కన ఎస్పీ రావుల గిరిధర్‌

- నలుగురు నిందితుల పట్టివేత, మరో ఇద్దరు పరారీ

- రూ.7 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

- వివరాలను వెల్లడించిన మల్టీజోన్‌ 2 ఐజీ సత్యనారాయణ

వనపర్తి క్రైం, డిసెంబరు22 (ఆంధ్రజ్యోతి) : వనపర్తి జిల్లా, పెబ్బేరు మండల పరిధిలోని జాతీయ రహదారిపై ఈ నెల 18వ తేదీ బుధ వారం తెల్లవారు జామున దారి దొపిడీకి పాల్ప డింది పార్ధీ గ్యాంగ్‌ పనే అని మల్టీజోన్‌ 2 ఐజీ సత్య నారాయణ తెలిపారు. వనపర్తి ఎస్పీ కా ర్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్‌తో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన జగిత్యాల జిల్లా కూజన్‌ కొత్తూరు గ్రా మానికి చెందిన ఎనిమి ది మంది ఒకే కుటుంబానికి చెందిన వారు తీర్ధయాత్ర ము గించుకుని పెబ్బేరు జాతీయ రహదారి మీదు గా స్వగ్రామానికి వెళ్తున్నారు. అర్ధరాత్రి దాటాక రెండు గంటల సమయంలో డ్రైవర్‌ సంతోష్‌ కు నిద్ర రావడంతో భారీ వాహనాలు నిలిపే స్థలంలో కారు పార్కింగ్‌ చేసి పడుకున్నా రు. 2.50 గంటల సమయంలో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు వచ్చి కారు పై ఉన్న లగేజీ బ్యాగులను పక్కనే ఉన్న పొలాల్లోకి తీసుకు వెళ్లి చూడగా వాటిలో ప్రసాదాలు, బట్టలు మాత్రమే కనిపించాయి. దీంతో వారు మళ్లీ కారు దగ్గరికి వచ్చారు. కత్తులు, రాళ్లతో కారు అద్దాలను ధ్వంసం చేసి, మహిళల నుంచి పుస్తెల తాడులు, బంగారు ఆభరణాలను లాక్కు న్నారు. ఆ తర్వాత కారు తాళాలు తీసు కుని పారిపోతుంటే డ్రైవర్‌ సంతోష్‌ వెం టపడటంతో అతడిని పిడిగుద్దులతో చితక్కొ ట్టినట్లు తెలిపారు. ఆ తరువాత పక్కనే నిలిపి ఉన్న రెండు చెరుకు ట్రాక్టర్లపై ఎక్కి పారిపో యారు. ఈ విషయాన్ని బా ధితులు వెంటనే పోలీసుల దృష్టికి తీసు కురాగా, ఎస్పీ రావుల గిరిధర్‌, డీఎస్పీ వెంకటేశ్వరరావులు ఘటన స్థలానికి చేరు కొని పరిశీలించారు. వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించి, నలుగురు నిందితులను అదుపులోకి తీసుకు న్నారు. పార్థీ గ్యాంగ్‌కు చెందిన వారు నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిపారు. దోపిడీలో పార్థీ గ్యాం గ్‌ మహరాష్ట్రకు చెందిన ఆరుగురు నిందితులు బద్రి గజనాన్‌ పింపలే, శ్రీరా మ్‌ శివాజీ షిండే, సచిన్‌ సంతోష్‌ షిండే, సయ్యద్‌ ఫిరోజ్‌ మహేతబ్‌, సంతోష్‌ పాండు రంగు కాలే, సంజ య్‌ పవార్‌ ఉన్నట్లు మల్టీజోన్‌ 2 ఐజీ తెలిపా రు. వారిలో సంతోష్‌ పాండురంగు కాలే, సంజ య్‌ పవార్‌ పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. నిం దితుల నుంచి ఆరున్నర తులాల బంగారు ఆభరణాలు, రెండు ద్విచక్ర వాహనాలు, మూ డు మొబైల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నా మని, వాటి విలువ సుమారు ఏడు లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు.

శ్రీధర్‌ రెడ్డి హత్య కేసు విచారణ 95 శాతం పూర్తి

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వన పర్తి జిల్లా, చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు శ్రీధర్‌ రెడ్డి హత్య కేసుకు సంబంధించి కేసు విచారణ 95 శాతం పూర్తి అయ్యిందని ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఈ కేసు విషయం లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించడంతో డీజీపీ ఆదేశాల మేరకు సీఐడి డీజీపీ షియా గోయంక ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్న ట్లు తెలిపారు. ఇప్పటికే 52 మందిని ఇంట రాగేషన్‌ చేశామని, మరో ఐదుగురు అనారో గ్యానికి గురైన వారు ఉన్నారని తెలిపారు. గ్రామ ఆధిపత్యంతో పాటు వివాహేతర సం బంధం నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిం దని నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు. సమా వేశంలో డీఎస్పీ వెంకటేశ్వరావు, సీఐలు కృష్ణ య్య, శివకుమార్‌, రాంబాబు, ఎస్‌ఐలు హరి ప్రసాద్‌, యుగంధర్‌రెడ్డి సిబ్బంది ఉన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:54 PM