Share News

పరమేశ్వరా.. పాహిమాం

ABN , Publish Date - Mar 08 , 2024 | 11:08 PM

మహాశివరాత్రి పర్వది నాన్ని పురస్కరించుకొని ఉమామహేశ్వర క్షేత్రానికి ఉమ్మ డి జిల్లా నలుమూలల నుంచే కాక నల్గొండ, హైదరాబాద్‌, కర్ణాటక నుంచి పెద్దఎత్తున భక్తులు తరిలి వచ్చారు.

 పరమేశ్వరా.. పాహిమాం
స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ దంపతులు, మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి దంపతులు

- ఉమామహేశ్వరానికి పోటెత్తిన భక్తులు

- స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్‌రెడ్డి దంపతులు, ఎంపీ పి.రాములు

అచ్చంపేట/టౌన్‌, మార్చి 8: మహాశివరాత్రి పర్వది నాన్ని పురస్కరించుకొని ఉమామహేశ్వర క్షేత్రానికి ఉమ్మ డి జిల్లా నలుమూలల నుంచే కాక నల్గొండ, హైదరాబాద్‌, కర్ణాటక నుంచి పెద్దఎత్తున భక్తులు తరిలి వచ్చారు. ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీ కృష్ణ దంపతులు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చంద్‌రెడ్డి దంపతులు ఉమామహేశ్వరుని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ఈవో శ్రీనివాస రావు, చైర్మన్‌ కందూరి సుధాకర్‌లు ాలువాలతో వారిని సత్కరించారు. అదేవిధంగా నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు ఉమాహేశ్వరుడ్ని దర్శించుకున్నారు. అర్చకులు వీరయ్య, రాజశేఖర్‌, చంద్రశేఖర్‌, రవికుమార్‌లు భక్తులకు పూజలు చేయించారు. ఆలయం వద్ద సిద్దాపూర్‌ ప్రాథమి క ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. అచ్చంపేట సీఐ రవీందర్‌ ఆదేశాల మేరకు ఎస్సై రాము పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రైవేటు వాహనాలను కొండపైకి వెళ్లకుండా కొండదిగువన ఉన్న భోగమహేశ్వరం వద్దనే నిలిపి వేశారు. దాదాపు 30వేల మంది భక్తులు వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. అలా గే, పట్టణంలోని ఆలయాలు శివనామ స్మరణతో మారు మోగాయి. పట్టణంలోని భమరాంబ ఆలయంతో పాటు భక్తమార్కండేయ ఆలయం, కన్యకాపరమేశ్వరి ఆలయాల లోని శివాలయాలలో తెల్లవారుజామునుంచే భక్తులు తర లివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల కమిటీ చైర్మ న్‌లు నల్లపు శ్రీనివాసులు, చంద్రశేఖర్‌, వనం పర్వతాలు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తమార్కండేయ ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టారు. ఆలయాల వద్ద రాత్రి జాగా రాల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, భజనలు, కోలాటాలు, కీర్తన లతో పాటు నృత్య ప్రదర్శన నిర్వహించారు.

నాగర్‌కర్నూల్‌లో..

కందనూలు: మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకు ని శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని పలు దేవాలయాల్లో శివనామస్మరణ మార్మోగింది. పాత మార్కె ట్‌ యార్డులోని శివాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు పట్నం సురేష్‌శర్మ రుద్రాభిషేకం, అభిషేకాలు, అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించినట్లు ఆయన తెలిపారు. రాంనగర్‌ కాలనీలో గల రామాలయంలోని శివాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్‌ అయ్యంగార్‌, ఎర్ర గడ్డలోని వినోభానగర్‌ కాలనీలో గల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు నర్వ వెంకటేశ్వరశర్మలు రుద్రాభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. శివపార్వతుల కల్యాణోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో శాస్త్రోక్తంగా ని ర్వహించారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పంచామృత, ఫలరసామృత, అభిషేకాలు, బస్మాభిషేకం, బిల్వాభిషేకం శాస్త్రోక్తంగా వేద మంత్రోచ్ఛా రణల మధ్య నిర్వహించారు. ఉపవాస దీక్షలు చేపట్టారు. భక్తులు పలు దేవాలయాల్లో భజనలు నిర్వహించారు. మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వినూత్న రీతిలో భక్తిని చాటుకున్న దంపతులు

మహాశివరాత్రిని పురస్కరించుకుని నా గర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రానికి చెందిన హకీం, ప్రసన్న దంప తులు వినూత్న రీతిలో త మ భక్తిని చాటుకున్నారు. ప్రతి రోజు ఒక శివలింగం పుట్ట మట్టితో తయారు చేసి 365 శివలింగాలను చేసి మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 365మట్టి శివలింగాలను శ్రీశైలం మల్లన్న సమక్షంలో నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు.

సోమేశ్వరాలయంలో మార్మోగిన శివనామస్మరణం

కొల్లాపూర్‌: దట్టమైన నల్లమల అడవుల మధ్య చు ట్టూ కృష్ణానది తీరాన వెలసిన లలితాంబిక సోమేశ్వరా లయంలో శంభో శంభో శివ శివ శంభో నామస్మరణంతో మారుమోగింది. శుక్రవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొల్లాపూర్‌ మండల పరిధిలోని సోమశిల గ్రామంలో పురాతన ప్రాచీనమైన లలితాంబిక సోమేశ్వ రాలయాన్ని భక్తులు భారీ సంఖ్యలో సందర్శించారు. ముందుగా కృష్ణానది తీరాన పుణ్యస్నానాలు ఆచరించి మహిమ గల సోమేశ్వరున్ని దర్శించి మొక్కులు తీర్చు కున్నారు. ఒకే మంటపంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు కలిగి న ఆలయంగా ప్రసిద్దిగాంచిన లలితాంబిక సోమేశ్వరాల యంలో మహాశివరాత్రి సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై ఆలయాన్ని సంద ర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమశిల లలి తాంబిక సోమేశ్వర దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో భ క్తులకు ఎలాంటి అసౌకర్యం ఏర్ప డకుండా ప్రత్యేక ఏర్పాట్లు నిర్వ హించారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియ ర్‌ నాయకులు చింతలపల్లి జగదీ శ్వర్‌రావు దంపతులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తు లకు అన్నదాన కార్యక్రమాన్ని ని ర్వహించారు. కొల్లాపూర్‌ మండల పరిధిలోని గ్రామాల్లో, కొల్లాపూర్‌ పట్టణ కేంద్రంలోని శివాలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజా నిర్వహించి శివాలయా లను దర్శించుకున్నారు.

సంగమేశ్వరాలయంలో...

మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆరాధ్య దైవంగా పూజించే సంగమేశ్వరాలయంలో శుక్ర వారం తెల్లవారుజామున బ్రాహ్మీ మూహుర్తంలో వేపధా ర శివ లింగాన్ని రుద్రాభిషేకం నిర్వహించి గర్భగుడిలో ప్రత్యేక అలంకరణలతో అలంకరించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మహాశివరాత్రి సందర్భంగా సంగమేశ్వరాల యాన్ని సందర్శించుకుని కృష్ణానది తీరాన స్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు.

Updated Date - Mar 08 , 2024 | 11:08 PM