Share News

పాలమూరు రంగారెడ్డి లింక్‌ కెనాల్‌తో కేఎల్‌ఐకి మహర్దశ

ABN , Publish Date - Oct 10 , 2024 | 11:28 PM

పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపో తల (ఎంజీకేఎల్‌ఐ)కు వట్టెం దగ్గర కేఎల్‌ఐ 41 కిలోమీటర్‌ దగ్గర లింక్‌ కెనాల్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఆయకట్టు రైతులకు మహ ర్దశ కలుగనుంది.

 పాలమూరు రంగారెడ్డి లింక్‌ కెనాల్‌తో కేఎల్‌ఐకి మహర్దశ
కేఎల్‌ఐ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం లింక్‌ కెనాల్‌ అందించనున్న వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్‌

- రూ. 12 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం

- కేఎల్‌ఐ కింద లక్ష 80 వేల ఎకరాలకు వెసులుబాటు

నాగర్‌కర్నూల్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : పాలమూరు రంగా రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపో తల (ఎంజీకేఎల్‌ఐ)కు వట్టెం దగ్గర కేఎల్‌ఐ 41 కిలోమీటర్‌ దగ్గర లింక్‌ కెనాల్‌ ఏర్పాటు చేయడం ద్వారా ఆయకట్టు రైతులకు మహ ర్దశ కలుగనుంది. వరద ప్రవాహం తీవ్రమైనప్పుడు, పంపు హౌజ్‌లో సాంకేతికమైన ఇబ్బందులు తలెత్తినప్పుడు పంటలను కాపాడుకు నేందుకు లింక్‌ కెనాల్‌ ఉపయోగపడనుంది. ఇందుకు సంబంధించిన కార్యాచరణ ఇరిగేషన్‌ అధికారులు రూ. 12 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం డీపీఆర్‌ కోసం ఆదేశించింది.నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ సమీపంలోని కృష్ణానదిపై కేఎల్‌ఐ, పాల మూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలు పక్కపక్కనే ఉన్నాయి. పంపుహౌజ్‌ లు, రిజర్వాయర్లు కూడా అక్కడే ఉండటంతో పాటు వాటి కాల్వలు కూడా స మాంతరంగా వస్తున్నాయి. ఈ క్రమంలో కేఎల్‌ఐకి సంబంధించిన అనేక కాల్వ లు పాలమూరు రంగారెడ్డి పథకంలో అంతర్భాగంగా మారి పోయాయి. పాల మూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన కాల్వలు నిర్మించే క్ర మంలో కేఎల్‌ఐకి సంబంధించిన కాల్వలు విచ్ఛిన్నమయ్యాయి. కేఎల్‌ఐ ప్రారం భంలో 2 లక్షల 45 వేల ఎకరాలకు సాగునీరందించాలనే సంకల్పంతో ప్రారం భమై రైతులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో ఆయకట్టు 4 లక్షల 45 వేల ఎకరాల కు చేరింది. ఇందుకోసం 45 టీఎంసీలు అవసరం కాగా ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లు నిర్మించినా వాటి సామర్థ్యం కేవ లం 4 టీఎంసీలు ఉండటంతో ఇరిగేషన్‌ అధికారులు శ్రీశైలం వరద జలాల ను చెరువులు, కుంటలకు అందించి కేవలం 2 లక్షల ఎకరాలకు నీరందించగలుగుతున్నారు. డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ కూడా ఇప్పటి వరకు లేదు. కృష్ణానదిలో వరద ఉధృతి పెరిగినప్పు డల్లా కేఎల్‌ఐ హెడ్‌వర్క్స్‌లో పంపులు మునిగిపోతున్నాయి. కేఎల్‌ ఐ మొత్తం ఆయకట్టుకు సాగునీరందించేందుకు అదనంగా 47 రిజర్వాయర్లు కావాలని సాగునీటి శాఖ అధికారులు ఐదేళ్ల క్రితం ప్రతిపాదించారు. అప్పటి ప్రభుత్వం వ్యాప్‌కోస్‌ అనే సంస్థకు సర్వే కోసం అనుమతించినా ఈ అంశం ఇంతవరకు దానికే పరిమితమైంది. లింక్‌ కెనాల్‌ ఏర్పాటు చేసి కేఎల్‌ఐలో కొత్త ఆయకట్టును స్థిరీకరణ చేస్తే మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లా ప్రజానీకానికి విస్తృతమైన ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

Updated Date - Oct 10 , 2024 | 11:28 PM