వైభవంగా పాగుంట వెంకన్న కల్యాణం
ABN , Publish Date - Jul 05 , 2024 | 10:55 PM
అమావాస్య సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.

- జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో అమావాస్య పూజలు
కేటీదొడ్డి/ అలంపూర్/ గద్వాల టౌన్/ ఉండవల్లి/ రాజోలి/ వడ్డేపల్లి/ జూలై 5 : అమావాస్య సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. కేటీదొడ్డి మండల పరిధిలోని వెంకటాపురం కొండపైనున్న పాగుంట లక్ష్మీ వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. వేకువజామునే అర్చకులు, ఆలయ పెద్దలు స్వామి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేసి, ప్రత్యేకంగా అలంకరిం చారు. అనంతరం అనంతరం ఉత్సవ మూర్తులతో ఆల యం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో స్వామి, అమ్మవారి కల్యాణాన్ని వైభ వంగా జరిపించారు. ఈ సందర్భంగా పలువురు భక్తు లు తమ వాహనాలకు పూజలు చేయించారు. జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
జోగుళాంబ ఆలయంలో భక్తుల రద్దీ
అమావాస్య, ఆరుద్రోత్సవం సందర్భంగా దక్షిణ కాశీ అలంపూరులోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో శుక్రవారం భక్తుల రద్దీ నెలకొన్నది. ఉద యం స్వామివారి ఆలయంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేసి గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిం చారు. అమ్మవారి ఆలయ ఆవరణలోని యాగశాలలో అర్చకులు చండీహోమం నిర్వహించారు. బాలబ్రహ్మే శ్వర స్వామికి అభిషేకం, అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన చేశారు.
భక్తిశ్రద్ధలతో మట్టి ఎద్దుల అమావాస్య
మట్టిఎద్దుల అమావాస్యను గద్వాల పట్టణ ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మట్టితో జోడెద్దులను, ఎలుకను తయారు చేసి, అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వాటిని పట్టణం లో ఊరేగించారు. అలాగే పట్టణంలోని రాతిబురుజు, సోమనాద్రినగర్, అశోక్‌నగర్, అడివేశ్వర స్వామి ఆలయం, కృష్ణానదికి వెళ్లే రోడ్డులోని ఆంజేయస్వామి, పిల్లిగుండ్ల కాలనీల్లోని ఆంజనేయ స్వామి ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
- ఉండవల్లి మండల పరిధిలోని డి బూడిదపాడు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశా రు. ఉదయం స్వామి వారికి తులసీదళ అర్చన, ఆకు పూజ తదితర విశేష పూజలు చేశారు. మధ్యాహ్నం సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ సమేత ఉత్సవ మూర్తులను పల్లకిలో ఊరేగించారు. అనంతరం వీఎస్టీ కంపెనీ సిబ్బంది భక్తులకు అన్నదానం చేశారు.
- రాజోలిలోని వైకుంఠ నారాయణ స్వామి సన్నిధిలో వెలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం స్వామి వారికి బిందెసేవ, అభిషేకం స్వామి వారిని సింధూరంతో అలంకరించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
గోమాతకు ప్రత్యేక పూజలు
శాంతినగర్ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో గో సంరక్షణ సమితి ఆధ్వర్యంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అర్చకుడు వినయ్ కౌశల్‌శర్మ, మాణిక్యం, రజిత, గాయత్రి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, రామచంద్రుడు, వెంకటేశ్వర్లు, రాములు, టెలిఫోన్ కృష్ణ పాల్గొన్నారు.