Share News

బడిబయటి పిల్లలు క్రీడల్లో రాణించాలి

ABN , Publish Date - Feb 11 , 2024 | 10:59 PM

బేటీ బచావో బేటీ పడావో పథకం అమలులో భాగంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, జిల్లా యువజన క్రీడా శాఖల ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరిధిలోని బడి బయటి బాలికలకు ఆదివారం మినీ స్టేడియంలో క్రీడా పోటీలను నిర్వహించారు.

బడిబయటి పిల్లలు క్రీడల్లో రాణించాలి
పరుగులు తీస్తున్న విద్యార్థులు

- సీడీపీవో శ్రీలత

- ఉత్సాహంగా క్రీడా పోటీలు

నారాయణపేట, ఫిబ్రవరి 11 : బేటీ బచావో బేటీ పడావో పథకం అమలులో భాగంగా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, జిల్లా యువజన క్రీడా శాఖల ఆధ్వర్యంలో ప్రాజెక్టు పరిధిలోని బడి బయటి బాలికలకు ఆదివారం మినీ స్టేడియంలో క్రీడా పోటీలను నిర్వహించారు. సీడీపీవో శ్రీలత పోటీలను ప్రారంభించి, మాట్లాడారు. సమాజంలో బాలికలు ఉన్నతంగా జీవించాలని, అవకాశాలు కల్పించుకొని లక్ష్యాన్ని చేరుకోవాలని, పొక్సో చట్టం, బాల్య వివాహాల నిర్మూలన చట్టాల గురించి వివరించారు. ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరీ నర్సిములు మాట్లాడుతూ కలెక్టర్‌, జిల్లా సంక్షేమ అధికారి ప్రోత్సాహంతో బడి మానేసిన పిల్లలకు ఓపెన్‌ స్కూల్‌లో అడ్మిషన్‌ కల్పించడమే కాకుండా వినూత్న ఆలోచనలతో ఆట పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. బాలికలు జీవితంలో ఏదైనా సాధించాలని పట్టుదలతో ముందుకెళ్లాలని, భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్‌ వైజర్‌ సరోజ, పీఈటీలు సాయినాథ్‌, మౌలానా, వెంకటప్ప, అక్తర్‌ పాషా, రమణ, పర్వీన్‌ బేగం, రాజశేఖర్‌, రామకృష్ణ, స్వప్న, నర్సిములు, అనిత, నరసింహా పాల్గొన్నారు.

Updated Date - Feb 11 , 2024 | 10:59 PM