సమస్యల పరిష్కారానికి సంఘటిత పోరు
ABN , Publish Date - Jul 08 , 2024 | 10:59 PM
సంఘటిత పోరాటాలతోనే కార్మిక వర్గ ప్రయోజనాల పరి రక్షణ, సమస్యల పరిష్కారం సాధ్యమని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ అన్నారు.

- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ
- ధర్నా బ్రోచర్ల విడుదల
గద్వాల టౌన్/ ధరూరు, జూలై 8 : సంఘటిత పోరాటాలతోనే కార్మిక వర్గ ప్రయోజనాల పరి రక్షణ, సమస్యల పరిష్కారం సాధ్యమని సీఐటీ యూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ అన్నారు. ఆ దిశగా ఈ నెల 10 తలపెట్టిన దేశ వ్యాప్త ధర్నాలో అన్ని రంగాలకు చెందిన కార్మి కులు భాగస్వాములు కావాలని కోరారు. ఆందోళ నకు సంబంధించిన బ్రోచర్లను సోమవారం పట ణంలోని రాంనగర్ బస్తీ దవాఖానా వద్ద ఆశ వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో, చింతలపేట భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ వర్కర్లకు మళ్లీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం దుర్మార్గమన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపో వడం బాధ్యతా రాహిత్యమన్నారు. కార్యక్రమాల్లో నాయకులు పద్మమ్మ, శశికళ, లక్ష్మి, శారద, హుసే నమ్మ, తిమ్మప్ప, లోకేష్, వెంకటేష్, మద్దిలేటి, రామకృష్ణ, గోవిందు పాల్గొన్నారు.
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ డిమాండ్ చేశారు. ఈ నెల 10న తల పెట్టిన కార్మికుల కోరికల దినాన్ని విజయవంతం చేయాలని కోరారు. దీనికి సంబంధించిన బ్రోచ ర్లను సోమవారం ధరూరు మండల కేంద్రంలోని వైఎస్‌ఆర్ చౌరస్తాలో విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ కొత్త లేబర్ కోడ్‌లను అమలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయ కులు ఎం.నరసింహులు, వెంకట్రాములు, వినయ్, లింగన్న, సైదన్న తదితరులు పాల్గొన్నారు.