Share News

కొనసాగుతున్న విభాగ్‌ స్థాయి ఖేల్‌ ఖూద్‌ పోటీలు

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:03 PM

సరస్వతి వి ద్యాపీఠం వార్షిక యోజనలో భాగంగా సరస్వతి శిశు మందిర్‌ ఉన్నత పాఠశాల నారాయణపేట లో ఆదివారం రెండో రోజు విభాగ్‌ స్థాయి ఖేల్‌ ఖూద్‌ పోటీలు కొనసాగాయి.

కొనసాగుతున్న విభాగ్‌ స్థాయి ఖేల్‌ ఖూద్‌ పోటీలు
గెలుపొందిన విద్యార్థులతో శిశు మందిర్‌ పాఠశాల నిర్వాహకులు

నారాయణపేట, జనవరి 28 : సరస్వతి వి ద్యాపీఠం వార్షిక యోజనలో భాగంగా సరస్వతి శిశు మందిర్‌ ఉన్నత పాఠశాల నారాయణపేట లో ఆదివారం రెండో రోజు విభాగ్‌ స్థాయి ఖేల్‌ ఖూద్‌ పోటీలు కొనసాగాయి. ఉమ్మడి పాల మూరు జిల్లాలోని వనపర్తి, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, పాలమూరు జిల్లాలోని 19 శిశు మందిర్‌ పాఠశాలలకు చెందిన బాలురు 275, బాలికలు 187 మంది, ఉపాధ్యాయులు 64 మంది ఇలా మొత్తం 536 మంది పాల్గొన్నా రు. చెస్‌, కబడ్డీ, క్యారం, ఖోఖో, పరుగు పందెం, త్రోస్‌, జంప్స్‌, వాలీబాల్‌ విభాల్లో శిశు వర్గ 3, 4, 5 తరగతులకు, బాల వర్గ 6, 7, 8 తరగ తులు, కిశోర వర్గ 9, 10 తరగతులకు పై అం శాలలో క్రీడా పోటీలను నిర్వహించారు. పోటీల అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కబడ్డీ, వాలీబాల్‌ సంఘం అధ్యక్షుడు, బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌ హాజరై మాట్లాడారు. క్రీడలు జీవితంలో ఒక భాగమన్నారు. ముందు ఓటమి ని ఎలా స్వీకరించాలన్నది నేర్పుతుందన్నారు. ఆయా విభాగ్‌ స్థాయిలో గెలుపొందిన విద్యా ర్థులను ఆయన అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. వచ్చే ఏడాది జూలైలో జరిగే ప్రాంత స్థాయి పోటీలకు మంచి శిక్షణ తీసుకొ ని అక్కడ కూడా గెలిచి మన పాలమూరు వి భాగ్‌కు మంచి పేరు తీసుకరావాలని క్రీడాకారు లను కోరారు. ఓడిన వారు నిరుత్సాహ ప డకుండా వచ్చే ఏడాది జరిగే పోటీల్లో గెలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు రతంగ్‌ పాండురెడ్డి, విభాగం విద్వత్‌ పరిషత్‌ కన్వీనర్‌ లక్ష్మయ్య, డా.మదన్‌ మోహన్‌, డా.కృష్ణారెడ్డి, టౌన్‌ బిల్డర్‌ వెంకట్రా ములు, రఘు రామయ్య, తిరుపతి, శ్రీనివాస్‌రె డ్డి, హెచ్‌ఎం దత్తు చౌద్రి, పీఈటీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 28 , 2024 | 11:03 PM