విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలి
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:10 PM
విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే జీ.మధుసూధన్‌రెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే జీ.మధుసూధన్‌రెడ్డి
భూత్పూర్/దేవరకద్ర, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థి దశ నుంచే క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే జీ.మధుసూధన్‌రెడ్డి అన్నారు. శనివారం భూత్పూర్ మునిసిపాలిటీలోని 9వ వార్డులోని బీఎల్ నారాయణ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్ కోచ్ కేంద్రాన్ని ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల్లో కూడా ఇలాంటి నెట్ ప్రాక్టీస్ క్రికెట్ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలని విద్యార్థులు, యువకులకు సూచించారు. అంతకుముందు దేవరకద్ర మండల కేంద్రంలో రేకుల తయారీ కంపెనీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో భూత్పూర్, దేవరకద్ర కాంగ్రెస్ మండలాల అధ్యక్షులు కేసీరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, అంజలిరెడ్డి, పట్టణ అధ్యక్షులు లిక్కి నవీన్‌గౌడ్, ఫారుక్ అలీ, నాయకులు పవన్‌కుమార్, మలిశెట్టి శెట్టి వెంకటేష్, గోవర్ధన్‌గౌడ్, శివరాములు, ఎండీ ఫారుక్, బోరింగ్ నర్సిములు పాల్గొన్నారు.