కాలినడకన శబరిమలకు
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:20 PM
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తుడు కూరగాయల రాము శుక్రవారం పాదయాత్రగా శబరిమలకు బయలుదేరాడు.

మక్తల్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తుడు కూరగాయల రాము శుక్రవారం పాదయాత్రగా శబరిమలకు బయలుదేరాడు. స్థానిక అయ్యప్పస్వామి ఆల యం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇరుముడులతో సాగ నంపారు. గత 11ఏళ్లుగా పాదయాత్రగా వెళుతున్న భక్తుడ్ని గురుస్వాములు అభినందించారు. అశోక్ గురుస్వామి, అనిల్ గురుస్వామి, కుమ్మరి రవి, కుమ్మరి రవి తదితరులు పాల్గొన్నారు.