Share News

అధికారులు సమన్వయంతో పనిచేయాలి

ABN , Publish Date - Feb 06 , 2024 | 10:47 PM

అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

 అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ప్రత్యేక అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

- ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, ఫిబ్రవరి 6: అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో వేసవిలో మంచినీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. మంగళవారం ఆయన అంబేడ్కర్‌ ప్రజా భవనంలో అధికారులతో సమీక్షాసమావేశం నిర్వ హించారు. ప్రత్యేకధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వచ్చేవేసవిని దృష్టిలో పెట్టుకొని మంచినీటి స మస్యను అదిగమించాలని ఆయన సూచించారు. ఎవరికి కేటాయించిన గ్రామాల్లో వారు పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకొంటూ సమస్యలు పరిష్కారం అయ్యేలా ప్రతీ ప్రత్యేక అధికారి చొరవ చూపాలన్నారు. ప్రత్యేక అధికారులు గ్రామాలకు వెళ్లకుండా నిర్లక్ష్యం వ హిస్తే శాఖపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుం దన్నారు. ఏదైన సమస్య జ టిలంగా ఉంటే నా దృష్టికి తీసుకరావాలన్నారు. గ్రామా ల్లో డ్రైనేజి, మంచినీటి సమ స్యలేకుండా అధికారులు ప నిచేయాలన్నారు. మండల డివిజన్‌ అధికారులు గ్రా మాలను పర్యటిస్తూ గ్రామ పంచాయతీల ప్రత్యేక అధి కారులను ప్రజలను సమ న్వయ పరుస్తూ సమస్య లను పరిష్కరించాల్సిన బా ధ్యత మండల, డివిజన్‌ అ ధికారులపై ఉందన్నారు. ప్ర జా పాలనలో ప్రతీ అధికారి భాగ్యస్వాములై ప్రజలకు చేరువయ్యే పాలన అందించాలని ప్రభుత్వ లక్ష్యాన్ని నె రవేర్చాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఆర్టీవో గోపిరామ్‌, డీఎల్‌పీవో వెంకటయ్య, డీఈ హేమలత, జ డ్పీటీసీ మంత్రియా నాయక్‌, ప్రతాప్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Feb 06 , 2024 | 10:47 PM