Share News

మార్మోగిన అయ్యప్ప నామస్మరణ

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:11 PM

అయ్యప్ప నామస్మరణతో మహ్మదాబాద్‌ కాంతిమల కొండ మార్మోగింది.

మార్మోగిన అయ్యప్ప నామస్మరణ
పడిపూజ నిర్వహిస్తున్న అయ్యప్ప భక్తులు

మహ్మదాబాద్‌, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : అయ్యప్ప నామస్మరణతో మహ్మదాబాద్‌ కాంతిమల కొండ మార్మోగింది. కాంతిమలపై ప్రతీ ఏటా నిర్వహించే అయ్యప్ప పడిపూజ ఆదివారం శ్రీను గురుస్వామి, చిన్మెష్‌ గురుస్వాముల ఆధ్వర్యంలో చెన్నయ్య గురుస్వామి 18వ పడినారికేల గురుస్వామి పూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు మహ్మదాబాద్‌ శివాలయం నుంచి 18 కళశాల ఊరేగింపులో పెద్ద ఎత్తున అయ్యప్ప భక్తులు పాల్గొనగా, అయ్యప్పకొండ వరకు ఊరేగింపు కొనసాగింది. అనంతరం గణపతి, కుమార స్వాములకు ప్రత్యేక పూజలతో పాటు స్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు ఆలపించిన భక్తి గీతాలు పలువురిని అలరించాయి. అనంతరం నారికేళ గురుస్వామి చెన్నయ్యకు చక్రసాన్నం చేయించి అయ్యప్ప స్వామి ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కనకాభిషేకం వేలంలో మహ్మదాబాద్‌కు చెందిన పాండు గురుస్వామి రూ.1.71 లక్షలకు సొంతం చేసుకున్నారు. అనతంరం స్వామి వారి పడి వెలిగించారు. పరిగి ఎమ్మెలే రామ్మోహన్‌రెడ్డి పడిపూజలో పాల్గొని ప్రతీ ఒక్కరు భక్తిభావం పెంచుకోవాలన్నారు. అయ్యప్ప దీక్ష ఎంతో కఠోరమైందన్నారు. అంతకుముందు పెంట్యానాయక్‌ గురుస్వామి భక్తులకు అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ రాంరెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు కమతం శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కేఎం నారాయణ, గండీడ్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జితేందర్‌రెడ్డి, నాయకులు లక్ష్మినారాయణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు మాచారం శ్రీనివాస్‌రెడ్డి, గురుస్వాములు చెన్నయ్య, రాజశేఖర్‌గౌడ్‌, గోపాల్‌, నాగరాజ్‌, బాల్‌రాజ్‌, గోవరఽ్ధన్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ అనంతయ్యగుప్త, దిడ్డికాడి గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:11 PM