చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ABN , Publish Date - Mar 06 , 2024 | 11:10 PM
అన్ని చట్టాల గురించి తెలుసుకొని, అన్ని రంగాలలో ముందుండాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి కె.కుష మహిళలకు సూచించారు.

- జిల్లా ప్రధాన న్యాయాధికారి కె. కుష
గద్వాల క్రైం, మార్చి 6 : అన్ని చట్టాల గురించి తెలుసుకొని, అన్ని రంగాలలో ముందుండాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి కె.కుష మహిళలకు సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆర్టికల్-15 మహిళలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ల గురించి తెలియజేస్తుందన్నారు. లీగల్ సర్వీస్ యాక్ట్ 1987లో ప్రారంభమైందని, చట్టాలపై ప్రజలకు అవగాహన కలిగిం చడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రాథమిక హక్కులు, విధులను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలన్నారు. అనంతరం కళాశాలలో సమస్యలపై చర్చించారు. కార్యక్రమంలో న్యాయసేవాధికార సంస్ధ సెక్రటరీ గంటా కవితాదేవి, అడ్వకేట్ లక్ష్మన్న, ప్రిన్సిపల్ సంపత్‌కుమార్ పాల్గొన్నారు.