Share News

పురపాలిక అభివృదేధ లక్ష్యం

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:54 PM

పురపాలికలోని అన్ని వార్డుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

పురపాలిక అభివృదేధ లక్ష్యం
మహబూబ్‌నగర్‌ పట్టణంలో సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

-ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి) : పురపాలికలోని అన్ని వార్డుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని 6, 25, 26 వార్డుల్లో రూ.20.80 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌ గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అన్ని వార్డుల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రజాపాలన మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించి దశల వారిగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న పనులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తోందన్నారు. అనంతరం శ్రీనివాస కాలనీలోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు రాజేందర్‌రెడ్డి, మూడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, కౌన్సిలర్లు ఫయాజ్‌, నర్సింహులు, రాషేద్‌, ప్రశాంత్‌, తిరుమల వెంకటేష్‌, నాయకులు సిరాజ్‌ ఖాద్రి పాల్గొన్నారు.

అత్యాధునిక హంగులతో బాలసదన్‌

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) : అత్యాధునిక హంగులతో బాలసదన్‌ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని బాలసదన్‌ నూతన భవన నిర్మాణాలకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. గత ప్రభుత్వం బాలసదన్‌, హాస్టళ్లను, గురుకులాలను పట్టించుకోలేదని, వాటిని బలోపేతం చేసే లక్ష్యంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న బాలసదన్‌ శిఽథిలావస్థకు చేరడంతో రూ.1.34 కోట్లతో బాలసదన్‌ భవన నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు వివరించారు. కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ, వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి జరినాబేగం పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:54 PM