Share News

సీఎం సభకు తరలిరండి

ABN , Publish Date - Feb 20 , 2024 | 11:21 PM

కోస్గిలో సీఎం రేవంత్‌రెడ్డి పేట - కొడం గల్‌ ఎత్తిపోతల పథకానికి బుధవారం శంకుస్థాపన చేస్తున్న తరుణంలో జిల్లాలోని ప్రజలు, రైదతులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కోరారు.

సీఎం సభకు తరలిరండి
ఎమ్మెల్యేను సన్మానించిన జల సాధన సమితి సభ్యులు

- ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి

నారాయణపేట, ఫిబ్రవరి 20 : కోస్గిలో సీఎం రేవంత్‌రెడ్డి పేట - కొడం గల్‌ ఎత్తిపోతల పథకానికి బుధవారం శంకుస్థాపన చేస్తున్న తరుణంలో జిల్లాలోని ప్రజలు, రైదతులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి కోరారు. బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు కోస్గిలో రేవంత్‌రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని, సీఎంతో పా టు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజ నర్సింహా, స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ తదితరులు హాజరౌతారన్నారు. అనంతరం కోస్గిలో జరిగే భారీ బహిరంగ సభకు రైతులు, ప్రజలు, కాంగ్రెస్‌ శ్రేణులు తరలిరావాలని ఆమె కోరారు. అదే విధంగా కోస్గిలో సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యే భారీ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌ శ్రేణులు, ప్రజలు తరలి రావాలని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి పిలుపు నిచ్చారు. మంగళవారం కోయిల్‌కొండలో కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. పేట - కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందని ఇందుకు కృతజ్ఞతగా నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.

ఎమ్మెల్యేకు వినతి..

జిల్లాలోని భారత మాల జాతీయ రహదారి భూ బాధితులు మంగళ వారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. కేం ద్ర ప్రభుత్వం భారత మాల పేరుతో భూ సేకరణ చేపట్టి పరిహారం ఇవ్వ డం లేదని, ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్‌లో అమ్మకాలు కొనుగోళ్లు నిషేదం విధించిందన్నారు. దీంతో భూములు విక్రయించాలన్నా, కొనాలన్నా, చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. కార్యక్రమంలో భూ బాధితులు, వామపక్ష నాయకులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు సన్మానం

పేట సీవీఆర్‌ బంగ్లాలో జల సాధన సమితి సభ్యులు, నా యకులు మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డిని శాలువా, పూలమాలతో సత్క రించి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో 69కు పరిపాలన అనుమతులు నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యేను సన్మా నించి, వెంటనే జీవో 69ను పూర్తిచేసి, ఆయకట్టుకు సాగు నీరు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు. అంతకుముందు లింగంపల్లి రేణుక ఎల్లమ్మను ఎ మ్మెల్యేను దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో జల సాధన సమితి సభ్యులు నరసింహ, వెంకోబా, అనంత్‌రెడ్డి, రంగారెడ్డి, బాల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, వెంకట రాములు, వెంకటప్ప, నాయకులు శివారెడ్డి, ఎండీ గౌస్‌, రవీందర్‌రెడ్డి, జనార్దన్‌, రాజీరెడ్డి, భీంప్రకాష్‌, ప్రవీణ్‌, సురేష్‌, జగన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 11:21 PM