Share News

ఎమ్మెల్సీ పోలింగ్‌ ప్రశాంతం

ABN , Publish Date - Mar 28 , 2024 | 11:40 PM

మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది.

  ఎమ్మెల్సీ పోలింగ్‌ ప్రశాంతం
నాగర్‌కర్నూల్‌ పోలింగ్‌ కేంద్రం-7లో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ఎమెల్సీ ఓటర్లు

- జిల్లాలో 99.69 శాతం పోలింగ్‌

- మొత్తం 319 ఓటర్లకు 318 మంది వినియోగం

- ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీ

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మార్చి 28: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యా ప్తంగా ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో మొత్తం 99.69 శాతం పో లింగ్‌ నయోదైంది. జిల్లా వ్యాప్తంగా 319 ఓట్లకు గాను 318 ఓట్లు పోలయ్యారు. అందులో 144 మంది పురుష ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా 174 మంది మహిళా ఓటర్లు ఓటును వినియోగించుకున్నారు. నియోజక వర్గాల వారిగా కొల్లాపూర్‌లో 67 మంది ఓటర్లకు గాను 67 మంది, నాగర్‌కర్నూల్‌లో 101 ఓటర్లుకు గాను 100 మంది, అచ్చంపేటలో 79 ఓటర్లకు గాను 79, కల్వకుర్తిలో 72 మంది ఓటర్లకు గాను 72 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ జిల్లాలోని నాలుగు పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ సరళిని ఫోన్‌ ద్వారా అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రాన్ని జిల్లా సహాయ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సీతారామారావు సందర్శించి పోలింగ్‌ సరళిని పరిశీలించారు. పోలింగ్‌ ముగిసన అనంతరం జిల్లాలోని నాలుగు పోలింగ్‌ కేంద్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను పోలీసుల పటిష్ట భద్రత మధ్య మహబూబ్‌నగర్‌ రిసీవింగ్‌ కేంద్రానికి తరలించారు.

ఫ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

నాగర్‌కర్నూల్‌ పోలింగ్‌ కేంద్రం-7 జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో స్థానిక ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు తమ ఓటు హక్కును విని యోగించుకున్నారు.

Updated Date - Mar 28 , 2024 | 11:41 PM