Share News

అమెరికా తెలుగు అసోసియేషన్‌ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కూచకుళ్ల

ABN , Publish Date - Jun 09 , 2024 | 11:07 PM

శనివా రం రాత్రి అమెరికాలో జరిగిన పాలమూరు ఎన్‌ఆర్‌ఐ ఫోరం(పీఎన్‌ఆర్‌ఐఎఫ్‌) మహబూ బ్‌నగర్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ ఉ త్సవాల్లో పాల్గొన్న నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు.

అమెరికా తెలుగు అసోసియేషన్‌ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కూచకుళ్ల
అమెరికాలో ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డిని సన్మానిస్తున్న నాగర్‌కర్నూల్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐలు, చిత్రంలో ఎమ్మెల్యేలు మధుసూదన్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూన్‌ 9 : శనివా రం రాత్రి అమెరికాలో జరిగిన పాలమూరు ఎన్‌ఆర్‌ఐ ఫోరం(పీఎన్‌ఆర్‌ఐఎఫ్‌) మహబూ బ్‌నగర్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ ఉ త్సవాల్లో పాల్గొన్న నాగర్‌కర్నూల్‌ ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్‌రెడ్డి పాల్గొన్నారు. నాగర్‌ కర్నూల్‌ అసెంబ్లీ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు హరీష్‌గౌడ్‌ సోదరుడు సాయితేజగౌడ్‌ ఎమ్మె ల్యే డాక్టర్‌ కూచకుళ్ల రాజేష్‌రెడ్డిని కలిసి శా లువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి మాట్లాడుతూ నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో కూలిపోయిన ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లు, పాఠశాలలు కట్టించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అలాగే నాగర్‌కర్నూల్‌ లో జూనియర్‌ కళాశాలను వచ్చే ఏడాది ఏ ప్రిల్‌ వరకు కట్టిస్తామన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణ, అభివృద్ధితో పాటు 24 గంటలు డాక్టర్లు, నర్సులను అందుబాటులో ఉండేవిధంగా చూస్తామన్నారు. అలాగే ఎన్‌ ఆర్‌ఐ ఫండ్స్‌ వస్తే అవి రాజకీయ నాయకుల చేతిలో కాకుండా ప్రజల వద్దకు నేరుగా చేరుస్తానన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రె డ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2024 | 11:07 PM