Share News

వైద్య కళాశాల భవన నిర్మాణం పూర్తి

ABN , Publish Date - Jun 05 , 2024 | 11:32 PM

జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యిందని, త్వరలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు.

వైద్య కళాశాల భవన నిర్మాణం పూర్తి
మెడికల్‌ కళాశాల భవనాన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, నాయకులు

- త్వరలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు

- ఈ ఏడాది నీట్‌ నుంచే అడ్మిషన్లు

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల, జూన్‌ 5 : జిల్లా కేంద్రంలో మెడికల్‌ కళాశాల భవన నిర్మాణం పూర్తయ్యిందని, త్వరలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నామని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి తెలిపారు. దౌదర్‌పల్లి దర్గా సమీపంలో నిర్మించిన మెడికల్‌ కళాశాల భవనాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ ఏడాది నుంచి అడ్మిషన్లు ప్రారంభం కానున్నా యని తెలిపారు. ఆయన వెంట జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ జంబు రామన్‌ గౌడ, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, వేణుగోపాల్‌, ఎంపీపీ విజయ్‌కుమార్‌, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు మురళి, దౌలు, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, భగీరథ వంశీ, కురుమన్న, నవీన్‌రెడ్డి మహబూబ్‌ ఉన్నారు.

రైతు బీమా చెక్కు అందజేత

గద్వాల న్యూటౌన్‌ : మల్దకల్‌ మండల పరిధిలోని మల్లెందొడ్డి గ్రామానికి చెందిన రైతు నాగేష్‌ ఇటీవల మరణించారు. ఆయన భార్య పద్మమ్మకు ప్రభుత్వం తరుపున ఐదు లక్షల రూపాయల బీమా మంజూరయ్యింది. దీనికి సంబంధించిన చెక్కును బుధవారం గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేతుల మీదుగా రైతు కుంటుంబ సభ్యులకు అందించారు.

పేద విద్యార్థికి ఆర్థిక సాయం

మల్దకల్‌ మండల పరిధిలోని మద్దెల బండ చిన్నతాండ్రపాడు గ్రామానికి చెందిన విద్యార్థి సంతోష్‌నాయక్‌ ఎంబీబీఎస్‌ చదువుకునేందుకు ప్రజాప్రతి నిధులు ఆర్థిక సాయం చేశారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ శ్రీధర్‌గౌడు, సింగిల్‌ విండో చైర్మన్‌ తిమ్మారెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు సత్యారెడ్డి, పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, విక్రమసింహారెడ్డి రూ. 10వేలు చొప్పున మొత్తం రూ. 70 వేలు విద్యార్థికి అందించారు.

Updated Date - Jun 05 , 2024 | 11:32 PM