Share News

పారిశుధ్యలోపం తలెత్తకుండా చర్యలు

ABN , Publish Date - Oct 25 , 2024 | 11:24 PM

కురుమూర్తి బ్రహ్మోత్సవాలు, జాతర సంద ర్భంగా పారిశుధ్య లోపం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి పార్థసారధి అన్నారు.

పారిశుధ్యలోపం తలెత్తకుండా చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న డీపీవో పార్థసారధి

- జిల్లా పంచాయతీ అధికారి పార్థసారధి

- కురుమూర్తి బ్రహ్మోత్సవాలపై సమీక్ష

చిన్నచింతకుంట, అక్బోబరు 25 (ఆంధ్రజ్యోతి) : కురుమూర్తి బ్రహ్మోత్సవాలు, జాతర సంద ర్భంగా పారిశుధ్య లోపం లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి పార్థసారధి అన్నారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా, చిన్నచింతకుంట మండలం, కురుమూర్తి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలపై శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయ న మాట్లాడారు. పంచాయతీ కార్యదర్శులు వారికి కేటాయిచిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖాధికారులకు సూచించారు. సమావేశంలో డివిజినల్‌ పంచాయతీ అధికారి నసీరొద్దీన్‌, ఎంపీడీవోలు సుధాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవోలు అనిల్‌కుమార్‌, శ్రీనివాస్‌రెడ్డి, విజ య్‌కుమార్‌, శంకర్‌నాయక్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

నేడు పాలకవర్గం ప్రమాణ స్వీకారం

కురుమూర్తి వెంకటేశ్వరస్వామి ఆలయ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం శనివారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి హాజరు కానున్నారని ఈవో మదనేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాలకవర్గంతో పాటు చైర్మన్‌ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 11:24 PM