Share News

మెనూ ప్రకారం భోజనం అందించాలి

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:57 PM

వసతిగృహాల్లో మెనూ ప్రకా రం భోజనం అందించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదే శించారు.

మెనూ ప్రకారం భోజనం అందించాలి
నారాయణపేట బాలుర వసతి గృహంలో విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌

- వసతి గృహాల తనిఖీ

నారాయణపేట టౌన్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): వసతిగృహాల్లో మెనూ ప్రకా రం భోజనం అందించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఆదే శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆనంద నిల యం, ఎస్సీ బాలుర వసతి గృహాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. ఆనంద నిల యంలో విద్యార్థులకు వడ్డిస్తున్న టిఫిన్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. అలాగే వంటగదిలో నిల్వ ఉన్న కూరగాయలు, డార్మెంటరీని చూశారు. వసతి గృహంలో మెనూను పరిశీలించిన కలెక్టర్‌ మెనూ లో కిచిడీ ఉండగా విద్యార్థులకు జీరా రైస్‌ వడ్డిం చడంపై కలెక్టర్‌ సిబ్బందిని నిలదీశారు. మెనూ తప్పక పాటించాలని, నాణ్యతతో కూడిన ఆహారం అందించాలని ఆదేశించారు. వంట చేసే సిబ్బంది తప్పనిసరిగా చేతితొడుగులు, హెడ్‌ క్యాప్‌లను ధరించాలని, భోజన సమయంలో శుభ్రత పాటిం చాలన్నారు. బాలికల వసతి గృహంలో నీరు రావ డం లేదని విద్యార్థులు కలెక్టర్‌ దృష్టికి తీసుకరాగా నీటి సరఫరా జరిగేలా చూడాలని మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. వంటకు ఉపయో గించే ప్యూరిఫైడ్‌ నీటిని సైతం నమూనా తీసు కొని పరీక్షించాలన్నారు.

అధికారుల పరిశీలన

కొత్తపల్లి : మండలంలోని నిడ్జింత గ్రామం లోని జడ్పీహెచ్‌ఎస్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి ఆనంద్‌ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యాన్ని పరిశీలించి, వంటగదిని చూశారు. భోజన ఏజెన్సీ నిర్వాహకులకు పలు సూచనలు చేసి, మెనూ ప్రకారం భోజనం వండాలని సూ చించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యా హ్న భోజనం చేశారు. మండల అధికారి ఆంజనే యులు, ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు ఉన్నారు.

మద్దూర్‌ : మద్దూర్‌లోని బాలికల బీసీ సంక్షేమ వసతిగృహాన్ని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి అబ్దుల్‌ ఖలీల్‌ తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా మధ్యాహ్న భోజనానికి వాడుతున్న బి య్యాన్ని, వంట సామగ్రిని, వంట గదిని పరిశీలిం చారు. వార్డెన్‌ జ్యోతి తదితరులున్నారు.

Updated Date - Nov 28 , 2024 | 11:57 PM