Share News

యేసు దీవెనలు అందరిపై ఉండాలి

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:33 PM

యేసు ప్రభు దీవెనలు అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.

   యేసు దీవెనలు అందరిపై ఉండాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి

- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : యేసు ప్రభు దీవెనలు అన్ని వర్గాల ప్రజలపై ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎంబీసీ చర్చి ప్రాంగణంలో ప్రభుత్వం నిర్వహించిన క్రిస్మస్‌ విందుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కెక్‌ కట్‌ చేసి, విందును ప్రారంభించారు. ముందుగా చర్చి పాస్టర్‌ వరప్రసాద్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లడుతూ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌, పీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌, ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌, చర్చి ప్రతినిథులు టైటస్‌ రాజేందర్‌, జాకోబ్‌, ఇమ్యాన్యూల్‌ రాజ్‌, స్టీఫెన్‌, క్రాంతి, సుజయ్‌ కుమార్‌, ప్రవీణ్‌, ఎస్‌ఈ సామ్యూల్‌, దాసరి సుందర్‌, మోహన్‌ పాల్గొన్నారు.

జడ్చర్ల : పట్టణంలోని ఎంబీ చర్చిలో నిర్వహించిన సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆదివారం పాల్గొన్నారు. బాదేపల్లి మార్కెట్‌ ఛైర్మన్‌ జ్యోతి అల్వాల్‌రెడ్డి, క్రైస్తవులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

మహబూబ్‌నగర్‌ తిర్పూర్‌గా అభివృద్ధి చెందాలి

పాలమూరు : భవిష్యత్తులో మహబూబ్‌నగర్‌ తిర్పూర్‌గా అభివృద్ధి చెందేందుకు అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఈ రోజు మొదటి అడుగు వేసిన మహిళ, రానున్న రోజుల్లో ఎన్నో గొప్ప విజయాలు సాధించాలి. మహిళలు స్వయంశక్తిపై ఎదుగుతూ ఎవరి కాళ్లపై వారు నిలబడాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ కళా భవన్‌లో మగువ స్వశక్తి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోహి సేవింగ్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ సహకారంతో మహిళలకు స్వయం ఉపాధిపై అవగాహన కల్పించారు. రాబోవు రోజుల్లో మహిళలకు సహకారం ఉంటుందన్నారు. సెట్విన్‌, మహేంద్ర, ఇన్ఫోసిస్‌ లాంటి సంస్థలతో యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించే బాధ్యత తీసుకుంటానన్నారు. ఇప్పటికే యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించేందుకు చర్యలు తీసుకుని, రూ.64 కోట్లతో ఐటీఐ కళాశాలను ఏటీసీ సెంటర్‌గా అభివృద్ధి చేసుకుని ఆరు కోర్సులు ప్రారంభించామన్నారు. ఇందులో 170 మంది బాలికలు శిక్షణ పొందుతున్న విషయం గుర్తు చేశారు. అనంతరం ఎంబ్రాయిడర్‌ మిషన్‌ను ఆవిష్కరించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్‌.వినోద్‌కుమార్‌, సంస్థ ప్రతినిధులు సంధ్య, సింధు, శిరీష, కిరణ్‌, బాలమణి, లక్ష్మణ్‌, గాయత్రి పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 11:33 PM