మక్తల్‌లో భారీ చోరీ
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:00 PM
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ద్వారకానగర్‌లో గల ఓ ఇంట్లో సోమవారం తెల్లవారుజామున భారీచోరీ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీఐ చంద్రశేఖర్, ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

66 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
మక్తల్, జూలై 8 : నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని ద్వారకానగర్‌లో గల ఓ ఇంట్లో సోమవారం తెల్లవారుజామున భారీచోరీ జరిగింది. ఈ ఘటనకు సంబంధించి సీఐ చంద్రశేఖర్, ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. స్థానిక సంగంబండ రోడ్ ద్వారక నగర్‌లో ఇంట్లో చిగుళ్లపల్లి రాఘవేందర్ కుటుంబం నివాసం ఉంటోంది. రాత్రి వారు నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వంటగది తలుపులు విరగ్గొట్టిన దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాలో ఉంచిన 66 తులాల బంగారం, రూ. 50 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఉదయం 5 గంటలకు ఇంటి యజమాని రాఘవేందర్‌కు మెలకువ వచ్చి చూడగా అప్పటికే ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువా తలుపులు కూడా తెరిచి ఉండి వస్తువులు చిందరవందరగా పడి కనిపించాయి. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి దొంగలను పట్టుకుంటామని సీఐ తెలిపారు. మక్తల్‌లో భారీచోరీ జరగడం చర్చనీయాంశమైంది.