మన్మోహన్‌సింగ్ మృతి దేశానికి తీరనిలోటు
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:44 PM
భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అనారోగ్యంతో మృతి చెందడంతో శుక్రవా రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల న్యూటౌన్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అనారోగ్యంతో మృతి చెందడంతో శుక్రవా రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మన్మోహన్‌సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పు డు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థికరంగ నిపుణుడిగా తన విద్వత్తును ప్రదర్శించారని కొనియాడారు. మితభాషిగా, అత్యంత సౌమ్యుడిగా, జ్ఞానాన్ని సొంతం చేసుకున్న స్థితప్రజ్ఞత కలిగిన నేతగా, భారత ప్రధాని మన్మోహన్‌సింగ్ దేశానికి అందించిన సేవలు గొప్పవన్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, రామకృష్ణనాయుడు, నాయకులు ఉన్నారు.