Share News

మామిడి రైతులు అధిక లాభాలు పొందాలి

ABN , Publish Date - May 21 , 2024 | 10:42 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మామిడి రైతులు ఆధునిక పద్ధతు లతో సాగు చేసి నాణ్యమైన పండ్ల ఉత్పత్తులు సాధించాలని అదేవి ధంగా దిగుబడితో పాటు, ఎగుమతు లు చేసి అధిక లాభాలు పొందాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు.

మామిడి రైతులు అధిక లాభాలు పొందాలి
మామిడి రైతుల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

నాగర్‌కర్నూల్‌, మే 21 (ఆంధ్ర జ్యోతి) : నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని మామిడి రైతులు ఆధునిక పద్ధతు లతో సాగు చేసి నాణ్యమైన పండ్ల ఉత్పత్తులు సాధించాలని అదేవి ధంగా దిగుబడితో పాటు, ఎగుమతు లు చేసి అధిక లాభాలు పొందాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ కలెక్టరే ట్‌ సమావేశ మందిరంలో నాగర్‌క ర్నూల్‌ జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మా మిడి సాగులో యాజమాన్య పద్ధతులతో పాటు, ఎగుమతులు, అధిక లాభాలపై జిల్లా రైతులకు నిర్వహించిన ఒకరోజు అవగాహన సదస్సుకు కలె క్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. నాగర్‌ కర్నూల్‌ ప్రాంతం అన్ని పంటల సాగుకు అను కూలమని, రైతులు ఉద్యాన, మామిడి పంటలు సాగు చేస్తూ ఆర్థికంగా ఎదగాలన్నారు. కొల్లాపూ ర్‌ మామిడికి ప్రపంచ దేశాల్లోనే మంచి గుర్తింపు ఉందని, అందుకనుగుణంగా రైతులు నూతన వ్యవసాయ పద్ధతుల ద్వారా మార్కెట్‌కను గుణంగా ఉత్పత్తులు చేసి అధిక లాభాలు ఆర్జిం చాలని సూచించారు. ప్రభుత్వం ఉద్యానవన పం టల సాగుకు అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఇప్పటికే జిల్లాలో 14,419 మంది రైతులు 33వేల 523ఎకరాల విస్తీర్ణంలో మామిడి తోటలు సాగు చేస్తున్నారన్నారు. జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైతుల నుంచి మామిడి కాయలు కొనుగోలు చేసి వివిధ దేశాలకు ఎగుమతులు చేస్తూ లాభదాయకమైన మార్కెట్లను నిర్వహిస్తున్నారని కలెక్టర్‌ తెలిపారు. కొల్లాపూర్‌ పరిసరాల్లో పండుతున్న మామిడి పండ్లు మంచి రుచికరంగా విదేశాలకు ఎగుమతి చేసే విధంగా ఉంటుందన్నారు. అందుకు రైతులు ఆధునాతన మార్కెట్‌ పద్ధతుల మెళకువలను పాటిస్తూ దేశ విదేశాలకు జిల్లా నుంచి మామిడిని ఎగుమతి చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. రైతులు పంట సాగుతో పాటు మార్కెట్‌ మెళకువలను పాటించడం అతి ముఖ్యమన్నారు. సదస్సును విజయవంతంగా నిర్వహించిన అధికారులను కలెక్టర్‌ సత్కరించి, మెమెంటోను బహూకరించారు. మామిడి రైతుల సదస్సులో రాష్ట్ర ఉద్యానవన శాఖ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఏ.ప్రేమ్‌సింగ్‌, నాబార్డు ఏజీఎం ఆర్‌పీ.నాయుడు, జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ అధికారి బి.చక్రపాణి, వనపర్తి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సురేష్‌, వికారాబాద్‌ ఉద్యానవన అధికారి కమల, రాష్ట్ర ఉద్యానవన శాఖ అధికారి మహేష్‌, నాబార్డు డీడీఎం మనో హర్‌రెడ్డి, డీఆర్‌డీవో చిన్నఓబులేష్‌, ఎల్‌డీఎండీ కౌశల్‌కిశోర్‌, పాండే, కేవీకే పాలెం ఉద్యానవన శాస్త్రవేత్త ఆదిశంకర్‌, ఉద్యానవన శాఖ కొల్లాపూర్‌ అధికారి ఎం.లక్ష్మణ్‌, కల్వకుర్తి ఉద్యానవన శాఖ అధికారి ఇమ్రాన్‌, మామిడి రైతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2024 | 10:42 PM