మహాపడి పూజను జయప్రదం చేయాలి
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:27 PM
అయ్యప్ప కొండపై సోమవారం 27వ వార్షిక మహాపడి పూజను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అయ్యప్ప సేవా సమాజం అఽఽధ్యక్షుడు భగవంతురావు అన్నారు.

- అయ్యప్ప సేవా సమాజం అఽఽధ్యక్షుడు భగవంతురావు
మహబూబ్‌నగర్ న్యూటౌన్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : అయ్యప్ప కొండపై సోమవారం 27వ వార్షిక మహాపడి పూజను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అయ్యప్ప సేవా సమాజం అఽఽధ్యక్షుడు భగవంతురావు అన్నారు. ఆదివారం పద్మావతి కాలనీ సమీపంలోని అయ్యప్ప కొండపై నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉదయం ప్రభాత సేవ, గణపతి హోమం, అయ్యప్ప స్వాములచే రక్తదాన శిబిరం నిర్వహిస్తామన్నారు. అనంతరం సాయంత్రం తూర్పూ కమాన్ నుంచి కళశ పూజ, అయ్యప్ప పల్లకీ సేవ, అనంతరం ఊరేగింపు రాంమందిర్ చౌరస్తా, గడియారం చౌరస్తా, ఆశోక్ టాకీస్ చౌరస్తా, పాత కలెక్టరెట్, ఎల్లమ్మ గుడి, న్యూటౌన్ చౌరస్తాల మీదుగా అయ్యప్ప కొండకు చేరుకుంటుందన్నారు. కొండపైకి చేరకున్న అయ్యప్పకు రాత్రి 11 గంటల వరకు పూలాభిషేకం నిర్వహిస్తామన్నారు. ఈ పూజా కార్యక్రమానికి ఎంపీ డీకే ఆరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఏపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పి.చంద్రశేఖర్‌తో పాటు అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరవుతారన్నారు. సమావేశంలో సేవా సమాజం కార్యదర్శి ముత్యం స్వామి, సంముక్త కార్యదర్శి పంభస్వామి, మల్యాద్రి రెడ్డి, జగదీశ్వర్, వెంకటేష్, విజయకుమార్, హర్షవర్ధన్‌రెడ్డి, కేశవులు, రవి, ప్రేమ్‌రాజ్, సంతోష్, దత్తుస్వామి, ఆశోక్ స్వామి పాల్గొన్నారు.