Share News

మహిళలకు అండగా మహాలక్ష్మీ పథకం

ABN , Publish Date - Sep 13 , 2024 | 11:00 PM

మహిళలకు అండగా మహాలక్ష్మీ పథకం ఉందని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు.

మహిళలకు అండగా మహాలక్ష్మీ పథకం
మహాలక్ష్మీ పథకం ప్రొసీడింగ్‌లు అందిస్తున్న మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- కొత్తపల్లి, వడ్వాట్‌ గ్రామాల్లో మహాలక్ష్మీ గ్యాస్‌ సిలిండర్ల పథకం ప్రారంభం

మాగనూరు, సెప్టెంబరు 13 : మహిళలకు అండగా మహాలక్ష్మీ పథకం ఉందని మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొత్తపల్లి, వడ్వాట్‌ గ్రామాల్లో మహా లక్ష్మీ గ్యాస్‌ సిలిండర్ల పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేర కు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తున్నా మన్నారు. సంవత్సరానికి సగటున కుటుంబానికి అవసరమయ్యే సిలిండర్లు అందిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల్లో అవకతవకలు జరుగుతు న్నట్లు తెలిస్తే 1967 లేదా 180042500333కు ఫోన్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సురేష్‌కుమార్‌, ఎంపీడీవో రహమ్మతుద్దిన్‌, ఎంపీవో విజయలక్ష్మీ, పంచాయతీ కార్యదర్శి నరసిం హారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌, వాకిటి శ్రీనివాసులు, దండు ఆనంద్‌, గడ్డం నరేష్‌, చక్రపాణిరెడ్డి, నరసింహారెడ్డి, ఉజ్జెల్లి కృష్ణయ్య, మాజీ సర్పంచులు రవీందర్‌, రాజు, కొత్తపల్లి శంకర్‌, రాములు, గోపాల్‌రెడ్డి తదితరులున్నారు.

క్రీడా దుస్తులు పంపిణీ

మక్తల్‌ : ఈనెల తొమ్మిదో తేదీన మక్తల్‌ మినీ స్టేడియంలో జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్‌జోన్‌ సైక్లింగ్‌ పోటీల్లో ఎంపికైన క్రీడాకారులకు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి శుక్రవారం 23 మందికి క్రీడా దుస్తులు అందించారు. ఈ సందర్భంగా విశ్రాంత పీఈటీ గోపాలం మాట్లాడుతూ ఈనెల 14, 15తేదీల్లో నిజా మాబాద్‌లో జరగనున్న ఖేలో ఇండియా సౌత్‌ జోన్‌ సైక్లింగ్‌ పోటీలకు మక్తల్‌ నియోజకవర్గం నుంచి 23 మంది ఎంపికైనట్లు తెలిపారు. అలాగే ఈనెల 11న మక్తల్‌ మండలం కర్ని జడ్పీహెచ్‌ ఎస్‌లో సబ్‌ జూనియర్‌ ఖోఖో పోటీలు నిర్వహిం చగా ఎంపికైన 30 మంది క్రీడాకారులకు రూ.20 వేల విలువ చేసే క్రీడా దుస్తులను గోపాలం తన స్వంత ఖర్చులతో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విశ్రాంత పీఈటీ గోపాలంను అభినం దించారు. కార్యక్రమంలో పీడీలు బి.రూప, స్వరూప, విష్ణువర్దన్‌రెడ్డి, పీఈ టీలు అంబ్రేష్‌, దామోదర్‌, మధు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 11:00 PM