Share News

మద్దిమడుగు అంజన్నా.. మళ్లీ వస్తామయ్యా..

ABN , Publish Date - Dec 15 , 2024 | 11:12 PM

నల్లమల లోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ పుణ్యక్షేత్రం భక్తులు, మాలాధారణ స్వాములతో కాషాయమం గా మారింది.

మద్దిమడుగు అంజన్నా.. మళ్లీ వస్తామయ్యా..
హనుమాన్‌ గాయత్రీ హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ దంపతులు

- 108 కలశాలచే కృష్ణానది జలాలతో మహా కుంభాభిషేకం

- హనుమాన్‌ గాయత్రీ మహాయజ్ఞం

- మద్దిమడుగు సన్నిధిలో వేలాది వాహనాలు, లక్షలాది భక్తులు

- మాలీజనే ప్రత్యేక నైవేద్యంగా అగ్నిగుండంలో సమర్పణ

- పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ దంపతులు, నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్‌ నాయక్‌

పదర, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): నల్లమల లోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ పుణ్యక్షేత్రం భక్తులు, మాలాధారణ స్వాములతో కాషాయమం గా మారింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రో జైన ఆదివారం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తజ నం మళ్లీ వస్తామయ్యా మద్దిమడుగు అంజన్నా అంటూ శరణు కోరుతూ ఆలయం నుంచి తమ త మ ప్రాంతాలకు వెనుదిరిగారు. ఆదివారం ఉద యం ఆలయ అర్చకులు వీరయ్య శాస్త్రీ, రుత్వి కులు శివప్రసాద్‌ శర్మ, రఘుశర్మ, ఆలయ పాలక మండలి, మాలాధారణ స్వాముల సమక్షంలో మద్దిమడుగుకు 12 కిలో మీటర్ల దూరాన పారుతు న్న కృష్ణానది జలాలను 108 కలశాలలో వేద మం త్రోచ్ఛారణల మధ్య, మంగళవాయిద్యాలతో తీసుకొ చ్చి మహాకుంభాభిషేకం నిర్వహించారు. అదే వి ధంగా పంచామృతాలైన ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, కొబ్బరిపాలు, పండ్ల కలయికతో మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించారు. అనంతరం సింధూరాభిషేకం, బంతి, చామంతి, రోజా పూలతో పూలాభిషేకం చేసి వస్త్రాలంకరణ చేశారు. 10,016 తమలపాకులతో ఆకుపూజ, వడ మాల, గజమాల, తెల్లజిల్లేడు పూల మాలలతో అలంకరించారు. ధూపం వేయడంతో పాటు మంగళ హారతులు ఇచ్చి నైవేద్యం సమర్పించారు.

ఆలయ ప్రాంగణంలో...

ఒకపక్క గర్భగుడిలో పూజలు జరుగు తుంటే ఆలయ ఆవరణంలో మాలాధారణ తో వచ్చిన భక్తులు ఆయా గురుస్వాముల సమక్షంలో మాల విరమణ చేశారు. అదే విధంగా గర్భగుడికి ఎదురుగా ఉన్న అగ్నిగుండం వద్ద భక్తులు గోదుమపిండి, ఆవునెయ్యి, బెల్లంతో తయారు చేసిన నైవేద్యం ‘మాలీజ’ను బాపూజీ మంత్రాల మధ్య భక్తి శ్రద్ధలతో సమర్పించారు. చన్నీటి స్నానమాచరించిన మహిళా భక్తులు అగ్నిగుండం వద్ద ప్రదక్షిణలు చేస్తూ నిండుబిందే నీళ్లు, కుడకలు, ఆవునెయ్యి, అగరుబత్తీలు, నవ ధాన్యాలతో మొక్కులు చెల్లించుకున్నారు.

హనుమాన్‌ గాయత్రీ హోమం...

మార్గశిర శుద్ధ పౌర్ణమి పురస్కరించుకుని పబ్బ తి ఆంజనేయ స్వామి ఆలయ సన్నిధిలో హనుమా న్‌ గాయత్రీ హోమం చేపట్టారు. రుత్వికులతో పాటు, జయరాం, శ్రీను గురుస్వాముల ఆధ్వర్యం లో భక్తిసంకీర్తణల మధ్య హనుమాన్‌ శరుణఘోశ వినిపించారు. హోమం చివరన నవధాన్యాలు, సు గంధ ద్రవ్యాలు, వివిధ రకాల చెక్కముక్కలను, ఆ వునెయ్యి, పూర్ణాహుతిని హోమంలో సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ, అనురాధ దంపతులతో పాటు, నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ అధ్య క్షుడు శంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు. ఆలయ చరి త్రను భక్తులకు అర్చకులు వివరించారు.

కోట మైసమ్మకు మొక్కుల చెల్లింపు...

పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయానికి తూర్పు ఈశాన్యంలో ఉన్న కోట మైసమ్మ అమ్మవారికి మహిళా భక్తులు పసుపు, కుంకుమ, గాజులు, చీర, సారెలతో అమ్మవారికి వడిబియ్యం పోశారు. ఇం కొంత మంది భక్తులు బండారుతో, మేకలు, కోళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగ ణంలో గుండుఎత్తే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అదే విధంగా చిన్న పిల్లలు జాతరలో ఆటల్లో మునిగిపోయారు. ఈ ఉత్సవాలలో అన్న దానం నిర్వహించారు. 200 మంది పోలీసు బందో బస్తుతో ఎస్సైలు రజిత, ఇందిర ఉన్నారు. ఆలయ ఈవో రంగాచారి, ఆలయ పాలక మండలి చైర్మన్‌ రాములు నాయక్‌, సభ్యులు అలరాజు, శ్రీను, సుబ్బదాసు, వెంకట్‌ తదితరులున్నారు.

Updated Date - Dec 15 , 2024 | 11:13 PM