Share News

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 24 , 2024 | 10:41 PM

ప్రభుత్వ నిబంధనల ప్రకార మే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ సంబంధిత అధికారులను ఆదేశించా రు.

 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు పరిష్కరించాలి
ఆన్‌లైన్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తు చేసుకున్న స్థలాలను యాప్‌ ద్వారా పరిశీలిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

- కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌

తాడూరు, ఆగస్టు 24 : ప్రభుత్వ నిబంధనల ప్రకార మే ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ సంబంధిత అధికారులను ఆదేశించా రు. శనివారం తాడూరు మండల కేంద్రంలోని శివారులో గల 401, 646 సర్వే నెంబర్లలో బంగిరాల సునీత, ఈ రోల్ల పకీరయ్య, ఈరోల్ల బాలప్ప, ఈరోల్ల వీరయ్య, వి.ను కలయ్యలు యాజమానులు తమ ప్లాట్‌ రెగ్యులరైజేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తులను ఆ స్థలం వద్ద ఎల్‌ఆర్‌ఎస్‌ యాప్‌ ద్వారా కలెక్టర్‌ స్వయంగా ప రిశీలించారు. ఈ సందర్భంగా సదరు యజమానులు ప్లాట్‌కు సంబంధించిన పత్రాల వివరాలను అధికారుల తో అడిగి తెలుసుకున్నారు. రహదారికి ఎంత మేర విస్తీ ర్ణం ఉందని, కొలతలను పరిశీలించాలని కలెక్టర్‌ సూచిం చారు. అన్ని పత్రాలు సవ్యంగా ఉన్న వాటిని ముందుగా ఆమోదం కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచిం చారు. పత్రాలు సరిగ్గా లేని వాటిని పెండింగ్‌లో ఉంచా లని సూచించారు. రెగ్యులరైజేషన్‌ కోసం యాప్‌లో ఉన్న ఎంపికలను ఒక్కొక్కటిగా కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీ లించారు. ప్లాట్‌ రెగ్యులరై జేషన్‌ విషయంలో రెవె న్యూ, నీటి పారుదల శా ఖ అధికారుల నివేదికల ను తీసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. మూడు శాఖల అధికారులు సమ న్వయంతో ప్లాట్‌ రెగ్యు లరైజేషన్‌ దరఖాస్తుకు పరిష్కారం చూపాలని, ఏమైనా అభ్యంతరాలు ఉంటే నిలిపివేయాలని తెలిపారు. అనంతరం త హసీల్దార్‌ కార్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించి ధరణి సమస్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండిం గ్‌లో ఉన్న 33 ధరణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరిం చాలని తహసీల్దార్‌ ప్రమీలను ఆదేశించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డాక్టర్‌ గత రెండు రోజుల నుంచి హాజరు కాలేదని తెలుపగా కలెక్టర్‌ వెంటనే డీ ఎంహెచ్‌వోను ఫోన్‌ ద్వారా షోకాజ్‌ నోటీస్‌ జారీ చేయా లని ఆదేశించారు. విధులకు హాజరు కాని వైద్య సిబ్బం దికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆయన డీఎం హెచ్‌వోను ఆదేశించారు. కలెక్టర్‌ వెంట జిల్లా పంచాయ తీ అధికారి రామ్మోహన్‌రావు, తహసీల్దార్‌ ప్రమీల, ఎం పీడీవో జ్యోతిపరోషియా, ఎంపీవో బ్రహ్మాచారి, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 10:41 PM