Share News

ఆగస్టు15లోగా రూ.రెండు లక్షల రుణమాఫీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:39 PM

వచ్చే ఆగస్టు 15వ తేదీ వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ పథ కాన్ని ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తుందని నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మల్లురవి రైతులకు హామీ ఇచ్చారు.

ఆగస్టు15లోగా రూ.రెండు లక్షల రుణమాఫీ
ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న డాక్టర్‌ మల్లురవి

- కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవి

అమ్రాబాద్‌, ఏప్రిల్‌ 26: వచ్చే ఆగస్టు 15వ తేదీ వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ పథ కాన్ని ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తుందని నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ మల్లురవి రైతులకు హామీ ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం మండల పరిధిలోని బీకె లక్ష్మాపురం తండా, బీకె లక్ష్మాపురం, వంగురోనిపల్లి, మాధవానిపల్లి, కుమ్మరోనిపల్లి తదితర గ్రామాల్లో డీసీసీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణతో కలిసి ఎన్నికల ప్రచారంలో భా గంగా నిర్వహించిన రోడ్‌ షోలో పాల్గొన్నారు. అమ్రాబాద్‌ ఎంపీపీ శ్రీనివాసులు, మాజీ ఎంపీపీ అచ్చిరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు హరినారాయణ గౌడ్‌, జిల్లా నాయకులు మల్లికార్జున్‌, కొయ్యల శ్రీనివాసులు, రేణయ్య, ఖైరత్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:39 PM