Share News

మండల సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం

ABN , Publish Date - Apr 16 , 2024 | 11:06 PM

: ప్రభుత్వ సహకారంతో మండల అభివృద్ధికి ఐక్యమత్యంగా కృషి చేద్దామని ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు.

మండల సమగ్రాభివృద్ధికి కృషి చేద్దాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ విజయలక్ష్మి

- సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ విజయలక్ష్మి

మద్దూర్‌, ఏప్రిల్‌ 16 : ప్రభుత్వ సహకారంతో మండల అభివృద్ధికి ఐక్యమత్యంగా కృషి చేద్దామని ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున సభ్యులు ఎలాంటి తీర్మాణాలు చేయలేదు. మండలంలో ఉన్న అటవీ భూముల వివరాలను సంబంధిత అధికారి ఇవ్వాలని ఎంపీపీ విజయలక్ష్మి ఆదేశించారు. అలాగే సొంత భవణాలు లేక అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్‌వాడీ కేంద్రాల వివరాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు. వేసవి దృష్యా ఉపాధి హామీ కూలీలు జాగ్రత్తలు పాటించాలని, వడ దెబ్బ తగలకుండా చర్యలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులు సూచించగా, ఉపాధి కేంద్రాల వద్ద తాగునీరు. ఎండలకు రక్షణ కల్పించే విఽధంగా చర్యలు తీసుకోవాలని సభ్యులు ఉపాధి హామీ అధికారులకు కోరారు. ఐసీడీఎస్‌ అధికారులు సమావేశానికి హాజరు కాకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి ప్రతి శాఖ అఽధికారులు హాజరు కావాలని అలా అయితే సంబంధిత ఆయా శాఖకు సంబంధించిన సమస్యలు ఆయా అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి వీలుంటుందని జడ్పీటీసీ సభ్యుడు రఘుపతిరెడ్డి అన్నారు. ఇక నుండి సమావేశానికి హాజరు కాని అధికారులపై శాఖా పరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని ఎంపీపీ విజయలక్ష్మి అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ అధ్యక్షుడు నరసింహా, వైస్‌ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, ఎంపీడీవో జయరాములు, మద్దూర్‌, కొత్తపల్లి తహసీల్దార్లు, ఎంపీసీటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 11:06 PM