Share News

సోనియమ్మ రుణం తీర్చుకుందాం

ABN , Publish Date - Apr 17 , 2024 | 11:31 PM

తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఆశీర్వదించాలని ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు ఓటర్లకు విజ్జప్తి చేశారు.

సోనియమ్మ రుణం తీర్చుకుందాం
ప్రచార సభలో మాట్లాడుతున్న మంత్రి జూపల్లి

- తెలంగాణలో ఓటు అడిగే హక్కు కాంగ్రెస్‌కే ఉంది : ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

గట్టు/ కేటీదొడ్డి/ ధరూరు/ గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 17 : తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఆశీర్వదించాలని ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు ఓటర్లకు విజ్జప్తి చేశారు. జోగుళాంబ గద్వాల పట్టణంతో పాటు, గట్టు, కేటీదొడ్డి, ధరూరు మండల కేంద్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ సరిత అధ్యక్షతన బుధ వారం నిర్వహించిన రోడ్‌షోల్లో ఆయన, నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి మల్లురవితో కలిసి పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్‌ పార్టీకే ఉందన్నారు. ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే పూర్తయ్యాయన్నారు. గట్టు లిఫ్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. మతం పేరుతో బీజేపీ చిచ్చు పెడ్తోం దన్నారు. బీఅర్‌ఎస్‌ను తిట్టిన అర్‌ఎస్‌ ప్రవీణ్‌కు కుమార్‌ అదే పార్టీలో చేరడం దారుణమన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. గద్వాల నిమోజకవర్గ ఇన్‌చార్జి జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత ద్వారానే అన్ని పథకాలను ప్రజలకు అందిస్తామని, కార్యకర్తలు ధైరంగా ఉండాలని చెప్పారు. కేటీదొడ్డి సభలో ఎంపీ అభ్యర్థి మల్లురవి మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. అనం తరం ధరూరు, గద్వాల పట్టణాల్లో మంత్రి జూపల్లి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, నాయకులు వరలక్ష్మి, వెంకటస్వామిగౌడ్‌, వెంకటస్వామిగౌడు, మధుసూదన్‌ బాబు, గట్టు తిమ్మప్ప, కేటీదొడ్డి మండల నాయకులు విష్ణుచిత్తుడు, శ్రీనివాసులు, తిరుపతి, శేషాద్రి, పిల్లి శ్రీనివాసులు, జంగిలప్ప, గద్వాలలో నిర్వహించిన సభలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, నాయకులు ఇషాక్‌, శంకర్‌, లత్తిపురం వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మైకు కోసం వాగ్వివాదం

గట్టు మండల కేంద్రంలో నిర్వహించిన రోడ్‌షోలో భాగంగా నిర్వహించిన ప్రచార సభలో మైకు కోసం సీనియర్‌ నాయకులు వాగ్వివాదానికి దిగారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌ మాట్లాడుతుండగా గట్టు ఎంపీటీసీ సభ్యుడు ఎస్‌.కృష్ణతో పాటు మరి కొందరు మండల నాయకులు అడ్డుతగిలారు. సీనియర్‌ నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, ప్రచారథంపైకి పిలవకుండా అవమానిస్తు న్నారని వాదనకు దిగారు. దీంతో వారిని ప్రచార రథంపైకి రావాలని చైర్‌పర్సన్‌ సరిత చెప్పడంతో వారొచ్చి ప్రసంగించారు. ఇలాంటి సంఘటనలు పునరా వృతం కానివ్వొద్దని సరిత వారికి సూచించారు.

Updated Date - Apr 17 , 2024 | 11:31 PM