Share News

వేడుకలను ఘనంగా నిర్వహించుకుందాం

ABN , Publish Date - May 27 , 2024 | 11:41 PM

జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అ వతరణ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్‌, టూరిజం, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్‌ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

  వేడుకలను ఘనంగా నిర్వహించుకుందాం
కొల్లాపూర్‌ మినీ స్టేడియంలో విద్యార్థులతో కలిసి టేబుల్‌టెన్నిస్‌ ఆడుతున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులకు మంత్రి జూపల్లి పిలుపు

కొల్లాపూర్‌, మే 27 : జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అ వతరణ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యం లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించుకుందామని రాష్ట్ర ఎక్సైజ్‌, టూరిజం, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్‌ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కొ ల్లాపూర్‌ పట్టణంలోని మంత్రి జూపల్లి క్యాంపు కార్యాల యంలో కొల్లాపూర్‌ మునిసిపల్‌ కౌన్సిలర్లతోపాటు వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్య కర్తలతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ వేడుకలను తొలి సారి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించేందుకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నా యన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రత్యేక తె లంగాణ రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ హాజరవుతారన్నారు. అదేవిధంగా రాష్ట్ర అవతరణ వేడుక లను ప్రతీ పల్లెపల్లెల్లో ప్రజల సమక్షంలో అంగరంగ వై భవంగా నిర్వహించేలా ప్రణాళికలు చేపట్టాలని ఆయన నాయకులకు పిలుపునిచ్చారు. సకలజనులను కలుపుకు ని వారి కులవృత్తులతో పాటు డప్పు వాయిద్యాలు, కళా కారుల కోలాటాల మధ్య అవతరణ దినోత్సవాలను ఘ నంగా నిర్వహించి తెలంగాణ ప్రతిష్టను ప్రపంచానికి చా టుదామని పిలుపునిచ్చారు. అం తకుముందు కొల్లాపూర్‌ పట్టణం లోని మినీ స్టేడియంలో మంత్రి జూపల్లి మార్నింగ్‌ వాక్‌లో భాగం గా స్టేడియంలో రత్నగిరి ఫౌండే షన్‌ ఆధ్వర్యంలో చేపట్టిన వేసవి క్రీడల క్యాంపులో పాల్గొని విద్యా ర్థులు, చిన్నారులతో కలిసి క్రీడ లు ఆడారు. మంత్రి వెంట కాం గ్రెస్‌ పార్టీ మునిసిపల్‌ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదు

పెంట్లవెల్లి: తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు. సోమవారం మండల కేంద్రంలో మార్నింగ్‌ వాక్‌ ని ర్వహించారు. ఈ సందర్భంగా యంగంపల్లితండాకు వెళ్లే దారిలో బ్రిడ్జిపై ఆరబోసుకున్న వరిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు ఎక్కువగా ఉన్నందున వరిని రైతులు పల్లపు ప్రాంతాలల్లో ఆరబో సుకోవాలని వారన్నారు. అదేవిధంగా రైతులు కవర్లను అందుబాటులో ఉంచుకుని ధాన్యం తడవకుండా చూసు కోవాలని వారు పేర్కొన్నారు. వరి తూకం వేసిన వెంట నే రైతులకు డబ్బులు చెల్లించే విధంగా చూసుకోవాలని ఐకేపీ వారికి సూచించారు. కాంగ్రెస్‌ మండల అధ్యక్షు డు నరసింహాయాదవ్‌, మాజీ సర్పంచ్‌సువర్ణమ్మ, మాజీ సింగిల్‌ విండో చైర్మన్‌ రామన్‌గౌడ్‌, కాంగ్రెస్‌ జిల్లా ప్రధా న కార్యదర్శి ఎండి.కబీర్‌, కాంగ్రెస్‌ నాయకులు భాస్కర్‌ గౌడ్‌, ఎర్రశ్రీను, కుమార్‌, గుడమోని రవి పాల్గొన్నారు.

ఎన్నికల కోడ్‌ ముగియగానే పరిష్కరిస్తాం

కోడేరు: రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ ముగియగానే నెలకొ న్న సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేసి తప్ప క పరిష్కరిస్తానని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామం లో మార్నింగ్‌ వాక్‌ చేసి గ్రామంలో వార్డు వార్డు కలియ తిరిగి ఎస్సీ కాలనీవాసులతో ముఖాముఖి మాట్లాడారు. ఈసందర్భంగా గ్రామస్థులు తమ సమస్యలు ఎకరువుపె ట్టారు. మాజీ ఎంపీపీ రామ్మోహన్‌రావు, నర్సాయిపల్లి మాజీసర్పంచ్‌లు, ఎంపీటీసీలు. నాయకులుపాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 11:41 PM