Share News

అభివృద్ధి అంటే ఏంటో చూపుతాం

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:13 PM

‘పాలమూరు భవిష్యత్తు కోసం.. మన భవిష్యత్తు కోసం పార్లమెంట్‌ ఎన్నికల్లో మేధావులు, విద్యావంతులు ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలి. కాంగ్రె్‌సను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.’ అని ఆ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు.

అభివృద్ధి అంటే ఏంటో చూపుతాం
మార్నింగ్‌ వాకర్స్‌ మద్దతు కోరుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి

మహబూబ్‌నగర్‌, మార్చి 22: ‘పాలమూరు భవిష్యత్తు కోసం.. మన భవిష్యత్తు కోసం పార్లమెంట్‌ ఎన్నికల్లో మేధావులు, విద్యావంతులు ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలి. కాంగ్రె్‌సను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా.’ అని ఆ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డితో కలిసి బాలుర జూనియర్‌ కళాశాల, స్టేడియం మైదానంలో మార్నింగ్‌ వాకర్స్‌తో పాటు వాక్‌ చేశారు. ఈ సందర్భంగా వారి మద్దతు కోరారు. దేశం మొత్తం రాహుల్‌గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటుందని, భారత్‌ జోడో యాత్రలో ఈ విషయం స్పష్ఠమైందని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని చెప్పారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిని ఎంపీగా గెలిపించి పార్లమెంట్‌కు పంపిస్తే పాలమూరును అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలు రాష్ట్రంలో ఎంతో నమ్మకంతో కాంగ్రె్‌సకు అధికారం ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మూడు నెలల్లోనే ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదింటిని అమలు చేసి ప్రజల మన్ననలను పొందుతున్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేస్తే మహబూబ్‌నగర్‌ అభివృద్ధిపై ప్రభావం పడుతుందన్నారు. జిల్లాకు చెందిన రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నందున మహబూబ్‌నగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఆయన ఇన్‌చార్జిగా ఉన్న ఈ పార్లమెంట్‌లో పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఇండోర్‌ స్టేడియంలో వంశీచంద్‌రెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డి, మునిసిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌కుమార్‌గౌడ్‌ క్రీడాకారులతో కలిసి బ్యాడ్మింటన్‌ ఆడారు. కార్యక్రమంలో నాయకులు వినోద్‌కుమార్‌, ఎన్‌పీ వెంకటేశ్‌, బెక్కరి మధు, సీఏ బెనహర్‌, సిరాజ్‌ఖాద్రి, సాయిబాబ, లక్ష్మణ్‌యాదవ్‌, ఫయాజ్‌, అజ్మత్‌అలీ, ఏర్పుల నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:13 PM