సీఎం ప్రకటనపై నేతన్నల హర్షం
ABN , Publish Date - Sep 10 , 2024 | 11:31 PM
నేతన్నలు తీసుకున ్న రూ.30కోట్ల రుణాలు మాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం పట్ల మంగళవారం అమరచింతలో నేత కార్మికులు కాంగ్రెస్ నాయకులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
అమరచింత, సెప్టెంబర్ 10: నేతన్నలు తీసుకున ్న రూ.30కోట్ల రుణాలు మాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం పట్ల మంగళవారం అమరచింతలో నేత కార్మికులు కాంగ్రెస్ నాయకులు సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పట్టణంలోని యూనియన్ బ్యాంకు వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటిశ్రీహరి చిత్రపటాల కు క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నేత కార్మికులు సం క్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారని, వారికి సీఎం అండగా నిలవడం సంతోషంగా ఉందన్నా రు. కార్యక్రమంలో సంఘం నాయకులు నామాల కృష్ణయ్య, మహంకాళి విష్ణు, దేవరకొండ మోహన్, పారుపల్లి శ్రీనివాసులు, పోతు శ్రీధర్, క్యామ కుమార్, జాలిగి వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, నాయకులు తిరుమలేష్, శ్యామ్, ప్రకాష్, తౌఫి క్, కమలాకర్‌గౌడ్, అంజి గౌడ్, విష్ణు, బాలరాజు, ఏబు పాల్గొన్నారు.