Share News

పోడు రైతులందరికీ భూమి హక్కు పత్రాలు

ABN , Publish Date - May 23 , 2024 | 10:57 PM

పోడు వ్యవసాయం చేసే రైతు లందరికీ భూమి హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుముఖంగా ఉన్నారని, త్వరలోనే పోడు వ్యవసాయదారులందరికీ శాశ్వత భూమి హక్కు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు అచ్చం పేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు.

 పోడు రైతులందరికీ భూమి హక్కు పత్రాలు
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

- ఖరీఫ్‌లో పోడు భూముల్లో వ్యవసాయానికి అటవీ శాఖ ఆటంకం కల్గించొద్దు

- ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ

మన్ననూర్‌, మే 23: పోడు వ్యవసాయం చేసే రైతు లందరికీ భూమి హక్కు పత్రాలు పంపిణీ చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సుముఖంగా ఉన్నారని, త్వరలోనే పోడు వ్యవసాయదారులందరికీ శాశ్వత భూమి హక్కు పత్రాలు పంపిణీ చేయనున్నట్లు అచ్చం పేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. అమ్రాబాద్‌ మండలం మన్ననూరులో గురువారం పా ర్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన సందర్భంగా ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్‌, పదర, లింగాల, బల్మూరు మండలాల్లో పోడు భూముల సమస్య తీవ్రంగా ఉందని, ఇట్టి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టనుందన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ లో పోడు వ్యవసా యం చేస్తున్న రైతులందరూ తమ పొలాల్లో విత్తనాలు వేసుకొని పంటలు సాగుచేసుకునేలా అటవీశాఖ క్షేత్ర సంచాలకులు, డీఎఫ్‌వోలతో మాట్లాడానన్నారు. తాజాగా బుధవారం తనను కలిసి మాచారం గ్రామ చెంచు రైతులకు పోడు భూముల్లో వ్యవసాయ పనులు చేసుకునేలా అనుమతి ఇప్పించామన్నారు. గతంలో సాగు చేసుకున్న భూములు కాకుండా కొత్తగా అడవిలో చెట్లు నరికి భూమి సాగు చేసుకుంటే ప్ర భుత్వం ఉపేక్షించబో దని, అట్టి వారిపై అటవీ చట్టాలనుపయోగించి ప్రభుత్వమే కేసులు నమోదు చేస్తుంద న్నారు. అమ్రాబాద్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ మొదటి ఫేజ్‌ పనులు మొదలు పెట్టేందుకు ఇరిగేషన్‌ శాఖ అధికారులతో గ్రామ సభలు నిర్వ హిస్తామన్నారు. కెపా సిటీ తక్కువ చేసి రీడిజైన్‌ చేసి రైతులు ఎక్కువగా భూములు కోల్పోకుండా చూస్తామని 15 రోజుల్లో రిజర్వాయ ర్‌, కెనాల్‌ పనులను మొదలు పెడతామని చెప్పారు. మరో ఆరు మాసాల్లో రెండో ఫేజ్‌ పనులు చేపట్టనున్న ట్లు చెప్నారు. వేసవిలో నియోజవర్గంలో తాగునీటి సరఫరాకు రూ.5 కోట్లు నిధులు మంజూరు చేయించిన సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలను తెలియజేశా రు. ఖరీఫ్‌లో రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలను సరఫరా చేసేలా వ్యవసాయశాఖ అధికారులను ఆదేశిం చినట్లు, ఖల్తీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేసే వ్యాపారులపై పీడి ఆక్టు కేసులు నమోదు చేస్తామన్నా రు. నియోజకవర్గంలో విద్య వైద్య సదుపాయాల కల్ప నపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీటి సరఫరా, టాయిలెట్ల ఏర్పాటు చేస్తామన్నారు. అచ్చంపేట ఏరియా ఆసుపత్రితో పాటు గా మండలాల్లోని ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగే లా కృషి చేస్తానన్నారు. ఈ నెల 5, 6వ తేదీలలో అచ్చం పేట ఏరియా ఆసుపత్రిలో నిర్వహించే ఉచిత శస్త్ర చికి త్స శిబిరంలో 24 రకాల ఆపరేషన్లు చేసేందుకు ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే 100 మంది రోగులు ఆపరేషన్ల కోసం రిజిస్ర్టేషన్లు చేయించుకున్నారని, నిరుపేదలంద రూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయ న కోరారు. ఎంపీటీసీ సభ్యుడు దాసరి శ్రీనివాసులు, కో ఆప్షన్‌ సభ్యుడు రహీం, డీసీసీ కార్యదర్శి సంభు వెంకట్‌ రమణ, కాంగ్రెస్‌ నాయకులు పెర్ముల వెంకటేశ్వర్లు, జూ లూరి సత్యనారాయణ, పంబలి బుచ్చయ్య, శివాజి, రహి మాన్‌, మేరాజ్‌, రమణగౌడ్‌, హతీరాం, రాజేంద్ర ప్రసాద్‌, రాజారాం, జహూర్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2024 | 10:57 PM