Share News

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం

ABN , Publish Date - Mar 24 , 2024 | 11:14 PM

లక్ష్మీనరసింహస్వామి బ్ర హ్మోత్సవాల భాగంగా ఆదివారం మఽఽధ్యాహ్నం మండల పరిధిలోని మామిళ్లపల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలోని కల్యాణ మండ పంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభ వంగా వేదపండితుల నడుమ కల్యాణం జరిపించారు.

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
స్వామి వారికి పట్టువస్ర్తాలు తీసుకువస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

ఉప్పునుంతల, మార్చి 24 : లక్ష్మీనరసింహస్వామి బ్ర హ్మోత్సవాల భాగంగా ఆదివారం మఽఽధ్యాహ్నం మండల పరిధిలోని మామిళ్లపల్లి గ్రామంలో ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలోని కల్యాణ మండ పంలో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం అంగరంగ వైభ వంగా వేదపండితుల నడుమ కల్యాణం జరిపించారు. కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ, అ నూరాధ దంపతులు హాజరై ఆలయంలో స్వామి వారికి వారు ప్రతేక్య పూజలు నిర్వహించి ఆలయం నుంచి ప్రభుత్వం లాంఛనంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు త లంబ్రాలు మండపానికి తీసుకవచ్చారు. అంతకు ముం దు ఎదుర్కోలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మె ల్యేతో పాటు ఆలయ కమిటీ చైర్మన్‌ మాధవరం రాజా ల్‌రావుతో పాటు నలుమూలల భక్తులు హాజరయ్యారు. అదే విధంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ సతీమణి అనూరాధ దంపతులతో పాటు ఆయల కమిటీ చైర్మన్‌ మాధవరం రాజాల్‌రావు దంపతులతో పాటు పలువు రు కల్యాణం తిలకించారు. అదే విధంగా మండల ప్ర జలతో పాటు వంగూరు, కల్వకుర్తి, తెలకపల్లి, అచ్చంపే ట, నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంతో పాట్టు పలు జిల్లాల ప్రజలు కల్యాణ మహోత్సవం తిలకించారు. భక్తులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వంహించారు. మొక్కు లు చెల్లించుకొని స్వామి తీర్ధ ప్రసాదం తీసుకున్నారు. ఉమామహేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆగమ శా స్త్రం ప్రకారం ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చే స్తామన్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి కల్యాణ మం డపాన్ని 20 లక్షల నిధులతో పూర్తి చేస్తామన్నారు. అదే విధంగా పెద్ద తేరు మరమ్మతులు చేయిస్తామన్నారు. కల్యాణోత్సవం పురస్కరించుకొని ఆలయం ఆవరణలో రాత్రి హైదరాబాద్‌ వారిచే డ్యాన్స్‌, సాంగ్స్‌, మిమిక్రీతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసురావు, నాయకులు మొహన్‌గౌడ్‌, గణేష్‌గౌడ్‌, దామోదర్‌, బాల్‌రావు, సైదులు, సుదర్శన్‌, అర్చకులు నర్సింహమూర్తి, విజయ రాఘవరావు, త్రివేదచారి, గోపాల్‌చారి, శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 11:14 PM