Share News

ఆడపడుచులకు అండగా కల్యాణ లక్ష్మి

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:18 PM

పేదింటి ఆడపడుచులకు అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ఉన్నదని గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు అన్నారు.

ఆడపడుచులకు అండగా కల్యాణ లక్ష్మి
కల్యాణలక్ష్మి చెక్కు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

- గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, విజయుడు

గద్వాల న్యూటౌన్‌/అలంపూర్‌ చౌరస్తా, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : పేదింటి ఆడపడుచులకు అండగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ ఉన్నదని గద్వాల, అలంపూర్‌ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, విజయుడు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు సంబంధించి 140 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పంపిణీ చేయగా, అలంపూర్‌ చౌరస్తాలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఎమ్యెల్యే విజయుడు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. అయిజ, ఇటిక్యాల మండలాలకు చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.3.19 కోట్ల విలువగల చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఈ డబ్బులను వృథా చేయకుండా అవసరానికి వినియోగించుకోవలన్నారు. ఉమ్మడి జిల్లా డైరెక్టర్‌ సుభాన్‌, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, కౌన్సిలర్లు శ్రీనివాసులు ముదిరాజ్‌, నాగిరెడ్డి, దౌలు, పూడురు కృష్ణ, నరహరిగౌడు ఉన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:18 PM