నేటి నుంచి ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ టోర్నీ
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:55 PM
జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నుంచి 27వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ టోర్నీ నేటి నుంచి బోయపల్లి సమీపంలో గల ఎండీసీఏ మైదానంలో నిర్వహించనున్నారు.
- తలబడనున్న ఆరు జట్లు
- ప్రతిభ కనబరిస్తే ఉమ్మడి జట్టుకు ఎంపిక
- టోర్నీని ప్రారంభించనున్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి
మహబూబ్‌నగర్ స్పోర్ట్స్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం నుంచి 27వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా అండర్-23 క్రికెట్ టోర్నీ నేటి నుంచి బోయపల్లి సమీపంలో గల ఎండీసీఏ మైదానంలో నిర్వహించనున్నారు. ఇటీవలే జరిగిన ఉమ్మడి జిల్లా ఎంపికల్లో 70 మంది క్రీడాకారులు ఎంపిక చేసి ఆరు జట్లుగా విభజించారు. పూల్-ఏలో మహబూబ్‌నగర్, నారాయణపేట, కొడంగల్, పూల్-బీలో నాగర్‌కర్నూల్, గద్వాల, వనపర్తి జట్లు ఉన్నాయి. పూల్-ఏ మ్యాచ్‌లు 21న మహబూబ్‌నగర్-నారాయణపేట, 22న నారాయణపేట-కొడంగల్, 23న కొడంగల్-మహబూబ్‌నగర్ జట్ల మధ్య పోటీలు ఉంటాయి. పూల్-బీ మ్యాచ్‌లు 24న నాగర్‌రకర్నూల్-గద్వాల, 25న వనపర్తి-నాగర్‌కర్నూల్, 26న గద్వాల-వనపర్తి జట్ల మధ్య పోటీలు ఉంటాయి. 27న పూల్-ఏ, పూల్-బి విజేతల మధ్య మ్యాచ్ ఉంటుంది. టోర్నీ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో తుది జట్టును ఎంపిక చేస్తారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నవంబర్‌లో 2 నుంచి వరంగల్, సంగారెడ్డి పట్టణాల్లో నిర్వహించే అండర్-23 రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీలో పాల్గొంటుంది. ఉదయం 11 గంటలకు టోర్నీని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించనున్నారు.