Share News

తగ్గేదేలే..

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:52 PM

పాలమూరులో ముందునుంచి మద్యం తాగే అలవాటు ఎక్కువే.. చిన్న,పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు మందు తాగడం అలవాటుగా ఉంది..

తగ్గేదేలే..

- ఉమ్మడి జిల్లాలో రూ.2700 కోట్ల మద్యం విక్రయాలు

- ప్రతీ నెల సగటున మద్యం కోసం రూ.225 కోట్ల ఖర్చు

- గతేడాది కన్నా తగ్గిన రూ.100కోట్ల విక్రయాలు

- ఎన్నికల సీజన్‌ కావడంతో 2023లో పెరిగిన సేల్స్‌

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పాలమూరులో ముందునుంచి మద్యం తాగే అలవాటు ఎక్కువే.. చిన్న,పెద్దా తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు మందు తాగడం అలవాటుగా ఉంది.. ఒకప్పుడు కు టుంబ సభ్యులు చాటుమాటుగా తాగేవాళ్లు కూడా ఇప్పుడు అంతా కలిసి కుటుంబ సపరి వార సమేతంగా తాగుతున్నారు... అంటే మం దుతాగడం ఇదివరకు పెద్ద తప్పుగా చాటు మాటుగా తాగేవాళ్లు ఇప్పుడు అలవాటుగా అ ది కామన్‌ అన్నట్లుగా అంతా కలిసి తాగుతు న్నారు. అందుకే మద్యం సేల్స్‌ ప్రతి ఏటా పె రుగుతూనే ఉన్నాయి. ఇంట్లో ఏ కార్యం జరిగినా మద్యం దిగాల్సిం దే.. పండగొచ్చినా, ఆదివారమైనా, మంగళవార మైనా ముక్కతోపాటు మందు పడాల్సిందే అ న్నట్లుగా మారడంతో పాటు బర్త్‌ వేడుకలు చే సినా, పుట్టుచీర కట్టినా రిసెప్సన్‌, చావుదినాలు అయినా మందు పెట్టడం ఓ స్టేటస్‌గా మారి పోయింది. తినేవాళ్లు తింటుంటే తాగేవాళ్లు తాగుతుంటారు.. ఇలా మద్యం విచ్చలవిడిగా కావడంతో విక్రయాలు జోరందుకుంటున్నా యి. 2023లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అ క్టోబరు, నవంబరు నెలల్లో విపరీతంగా మ ద్యం విక్రయాలు జరిగాయి. దీంతో గతేడాది రూ.2800 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది ఎన్నికలు లేకపోయినా అదే స్థాయి లో మద్యం విక్రయాలు జరిగాయి. మద్యం దుకాణాలకు గతేడాది డిసెంబరు నుంచి కొత్త పాలసీని అమలు చేశారు. ఈ ఏడాది డిసెంబ రు 29 నాటికి 27,64,591 లిక్కర్‌ కేసులు, 38,88,856 కేసుల బీరు విక్రయాలు జరిగాయి. వీటి ద్వారా రూ.2674 కోట్ల ఖర్చుచేశారు. చివ రి రెండ్రోజులు రూ.2700 మార్కును దాట నుంది.

విచ్చలవిడిగా బెల్ట్‌ దుకాణాలు

ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వనరుల్లో ఎక్సై జ్‌, రిజిస్ట్రేషన్‌ శాఖలు ప్రధానమైనవి. ఈ ఏ డాది రియల్‌ ఎస్టేట్‌ కాస్త తగ్గుముఖం ప ట్టడంతో ఆ ఆదాయాన్ని మద్యం దుకాణాల ద్వారా పెంచుకునేందుకు విచ్చలవిడిగా బెల్ట్‌ దుకాణాల ద్వారా మద్యం విక్రయాలు పెంచు కోవాలని పరోక్షంగా ఎక్సైజ్‌శాఖనే ప్రోత్సహి స్తోంది. అందుకే ఊళ్లో వాడవాడల్లా బెల్ట్‌దుకా ణాలు వెలిశాయి. మద్యం పర్మిట్‌ రూమ్‌లు, దాబాలలో కూడా విచ్చలవిడిగా మద్యం విక్ర యాలు సాగుతున్నాయి. మద్యం దుకాణాలు దందా పరోక్షంగా బెల్ట్‌ దుకాణా లపైనే ఆధారపడి సాగుతుందన్న వి షయం బహిరంగ రహస్యమే. మద్యం కోసం రూ.2700 కోట్లు తగలేస్తున్న మందుబాబులు అందులో మంచింగ్‌కోసం మరో వెయ్యికోట్లను ఖర్చుచేస్తోంది. వెరసి జిల్లాలో మద్యం కోసమే జనాలు ఏడాదికి రూ.3700-4000 కోట్లను ఖర్చు చేస్తున్నారు.

Updated Date - Dec 30 , 2024 | 11:52 PM