Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

పార్టీని బద్నాం చేయడం సరికాదు

ABN , Publish Date - Mar 03 , 2024 | 11:30 PM

కొందరు కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ తమ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని బద్నాం చేయడం సరికాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజేంద్రప్రసాద్‌ అన్నారు.

పార్టీని బద్నాం చేయడం సరికాదు
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌

- కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌

- విచ్ఛిన్న నాయకుల మాటలు విని మోస పోకండి

- చిన్నారెడ్డిని విమర్శించే స్థాయి మీకెక్కడిది?

వనపర్తి టౌన్‌, మార్చి 3: కొందరు కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ తమ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని బద్నాం చేయడం సరికాదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఇతర పార్టీ నాయకులను కాం గ్రెస్‌లో చేర్చుకోవడం జరుగుతుందన్నారు. ఉద్దేశ పూర్వకంగా చిన్నారెడ్డి ఎవరినీ ఇంటికి వెళ్లి తీసుకురాలేదని, వచ్చిన వారిని పార్టీలో చేర్చుకో వడం తప్పు ఎలా అవుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి దీప్‌దాస్‌ మున్షీ, ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి సూచనలతోనే పార్టీలో చేరిక లు జరిగాయని, మరి గతంలో మీరెందుకు చేరిక లు చేశారని, మీరు చేస్తే ఒప్పు, చిన్నారెడ్డి చేస్తే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి వెంట ఉండే కొందరు తమ స్వార్థ రాజకీయలతో పార్టీని బజారు పాలు చేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇద్దరు కలిసి ముందుకు సాగితే తమ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందనే ఊహతోనే కొంతమంది ఊసరవెల్లి రాజకీయలకు తెర తీశారని అన్నారు. గ్రూపు రాజకీయలకు బీజం వేసిది మీరేనని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు అలాంటి విచ్ఛిన్న నాయ కుల మాటలు విని మోస పోకండని హితవు పలికారు. కాంగ్రెస్‌ పార్టీ అంటేనే సముద్రమని, నలుగురు ఉండే పార్టీ కాదని, పార్టీలో ఎంతో మంది వస్తూ, పోతు ఉంటారని, మొదటగా మీలోని అభద్రత భావం వీడాలని సూచించారు. మొన్న జరిగిన పత్రికా సమావేశం ఎమ్మెల్యేకు తెలియకుండా జరిగితే, సమావేశం నిర్వహించిన వారిని ఎమ్మెల్యే కలుగజేసుకుని నిలువరించాలని, లేదంటే పార్టీ అబాసుపాలు అవుతుందన్నారు. చిన్నారెడ్డిని విమర్శించే స్థాయి ఆ నలుగురికి లేదన్నారు. చిన్నారెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేసిన నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కదిరె రాములు, కిరణ్‌కుమార్‌, కోట్ల రవి, నందిమల్ల యాదయ్య, ఎండీ బాబా, రాగి వేణు, అబ్దుల్లా, జానంపేట నాగరాజు, సేవాదళ్‌ జానకిరాములు, బొడ్డుపల్లి నరసింహ, ఇర్షద్‌, మెడల వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2024 | 11:30 PM