Share News

ప్రభుత్వ పాఠశాలకు భద్రతేదీ..?

ABN , Publish Date - Apr 12 , 2024 | 10:53 PM

ప్రభుత్వ పాఠశాలలకు భద్రత కరువైంది.

ప్రభుత్వ పాఠశాలకు భద్రతేదీ..?
అమరచింత హై స్కూల్లో దుండగులు విరగొట్టిన బెంచీలు

- తరగతి గది తలుపులు, బెంచీలు, విరగొట్టిన దుండగులు

అమరచింత, ఏప్రిల్‌ 12: ప్రభుత్వ పాఠశాలలకు భద్రత కరువైంది. నైట్‌ వాచ్‌మెన్‌ లేకపోవడంతో పాఠశాలలోని విలువైన వస్తువులను ధ్వంసం చేస్తున్నారు. గురువారం అర్ధరాత్రి అమరచింత పట్టణ మధ్యలో ఉన్న ప్రభుత్వ పాఠశాల తలుపులు, బెంచీలను గుర్తు తెలియని వ్యక్తులు విరగొట్టారు. పోకిరీలు తరచు పాఠశాల భవనాల కిటికీలు, తలుపులు విరగకొట్టడంతో పాటు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పాఠశాల ఆవరణలో మద్యం తాగి సీసాలను అక్కడే పగులగొట్టడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అంతే కాకుండా పాఠశాలలో కంప్యూటర్లు, టీవీ, రికార్డులతో పాటు విలువైన సామాగ్రి సైతం ఉండడంతో రాత్రివేళలో వాచ్‌మెన్‌ను ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 12 , 2024 | 10:53 PM