Share News

విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు

ABN , Publish Date - Apr 02 , 2024 | 10:47 PM

జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 30 గ్రామాల్లో మంగళవారం విద్యార్థులకు జాతీయ అయోడిన్‌ లోప రుగ్మత నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు.

విద్యార్థులకు అయోడిన్‌ పరీక్షలు
కొల్లూర్‌ పాఠశాలలో వైద్య పరీక్షలు చేస్తున్న సిబ్బంది

మక్తల్‌, ఏప్రిల్‌ 2 : జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 30 గ్రామాల్లో మంగళవారం విద్యార్థులకు జాతీయ అయోడిన్‌ లోప రుగ్మత నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ సౌ భాగ్యలక్ష్మి మండలంలోని సంగంబండ, చందాపూర్‌, కర్నీ, ముస్లాయిపల్లి పాఠశాలలను ఎంపిక చేసి విద్యార్థులకు యూరిన్‌, అయోడిన్‌ పరీ క్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రిపోర్టులను హైదరాబాద్‌కు పంపిస్తున్నట్లు తెలిపారు. అయోడిన్‌ తక్కువ ఉన్న వారు అయోడిన్‌ ఉప్పు వాడాలని సూచించారు. అయోడిన్‌ లోపం కారణంగా దైతర్‌, మానసికంగా, శారీరకంగా ఎదుగుదల లోపం ఉంటుందని అయోడిన్‌ సరైన మోతాదులో తీసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది డాక్టర్‌ తిరుపతి, డాక్టర్‌ వినోద్‌కుమార్‌ గౌడ్‌, అబీబ్‌, ఏఎన్‌ఎం పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట/టౌన్‌ : ప్రభుత్వ ఎయిడెడ్‌ దయానంద్‌ విద్యా మందిర్‌ ఉన్నత పాఠ శాలలో మంగళవారం (ఎన్‌ఐడీడీసీపీ) జాతీయ అయోడిన్‌ లోపం వల్ల విద్యార్థుల్లో వచ్చే గాయిటర్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. పాఠశాలలో ఆరు సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల విద్యార్థులకు వారి ఇంట్లో వాడుకునే ఉప్పుని తెప్పించి పరీక్షించారు. 45 మంది బాలికలు, 45 మంది బాలురకు కంఠంలో గాయిటర్‌ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వ హించారు. ప్రతీ 10 మంది విద్యార్థుల యూరిన్‌ సేకరించి పరీక్ష నిమిత్తం ల్యాబ్‌కు పంపిం చారు. ఈ సందర్భంగా యూపీహెచ్‌సీ వైద్యాధికారి నరసింహరావు సగరి మాట్లాడుతూ నిత్య జీవితంలో ఉప్పు ప్రాముఖ్యత అందులోని అయోడిన్‌ పదార్థ విశిష్టతను వివరించారు. లక్షణాలు, లాభ నష్టాల గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయుడు నారాయణ, ఉపాధ్యాయ బృందం ఏఎన్‌ఎం పుష్ప, సరస్వతి, రామేశ్వరి, పుష్పలత, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 02 , 2024 | 10:47 PM