అంతర్గత రోడ్లు అధ్వానం
ABN , Publish Date - May 26 , 2024 | 11:31 PM
స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రామాలు, పట్ణణాల రోడ్లు ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పుకొస్తున్న ఆ యోగం మద్దూర్ అంతర్గ రోడ్లను చూస్తే అభివృద్ధి మచ్చుకైన కానరావడం లేదని తెలుస్తోంది.
- అవస్థల్లో పట్టణ వాసులు
- కాడా పైనే అన్ని ఆశలు
- కోడ్ ముగియగానే దృష్టి సారించాలని విన్నపం
మద్దూర్, మే 25 : స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ ప్రభుత్వ హయాంలో గ్రామాలు, పట్ణణాల రోడ్లు ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పుకొస్తున్న ఆ యోగం మద్దూర్ అంతర్గ రోడ్లను చూస్తే అభివృద్ధి మచ్చుకైన కానరావడం లేదని తెలుస్తోంది. పట్టణంలో ఏ వీధిలో చూసినా రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది. అసలు ఇవి పట్టణ రోడ్లేనా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రతీ సంవత్సరం ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద అక్కడక్కడ గల్లీ రోడ్లు మాత్రమే కొన్ని సీసీగా మారగా చాలా ప్రధాన రోడ్లు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. ముఖ్యంగా మద్దూర్ పాత బస్టాండ్ నుంచి జీపీ రోడ్డు, పోలీస్‌స్టేషన్ నుంచి అమర్‌గడ్డ మీదిగేరి రోడ్డుతో పాటు పాత ఎస్‌బీఐ రోడ్డు, పాత ఎస్సీకాలనీ, చర్చి కాలనీ, బాన్‌గేరి తదితర రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. వీటి అభివృద్ధి గురించి దశాబ్దాలుగా పట్టించుకోకపోవడంతో గతుకులు, అతుకులతో దుమ్మెత్తి పోస్తున్నాయి. కాంగ్రెస్ అధికారం రావడంతో కొడంగల్ సమగ్రాభివృద్దికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (కాడా) ఏర్పాటు చేసి ఇందుకోసం ప్రత్యేక అధికారిని నియమించడంతో పట్టణ ప్రజల ఆశల్నన కాడా వైపు చూస్తున్నాయి. రోడ్డు అభివృద్ధికి స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారుల నుంచి కాడా అధికారి ప్రతిపాదనలు తీసుకోవడం శుభపరిమాణంగా మారింది. అయితే వీటిలో సంత బజార్ నుంచి జీపీ ప్రధాన రోడ్డ విస్తరణకు ప్రతిపాదనలు కూడా ఇవ్వడంతో జరిగిందని, అలాగే పట్టణంలో అన్ని అంతర్గ రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, కోడ్ కారణంగా జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. అధికారులు పట్టణ రోడ్లు అభివృద్దిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ఇబ్బందులు దూరం చేయాలని కోరుతున్నారు.