మక్తల్ పోలీస్‌స్టేషన్ తనిఖీ
ABN , Publish Date - Dec 27 , 2024 | 11:13 PM
ప్రజల మన్ననలు పొందేలా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించాలని పేట డీఎస్పీ ఎన్.లింగయ్య అన్నారు.

మక్తల్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రజల మన్ననలు పొందేలా పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించాలని పేట డీఎస్పీ ఎన్.లింగయ్య అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం మక్తల్ పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలతో పాటు, రికార్డులు, సిబ్బంది ఆర్టికల్స్ పరి శీలించి, కేసుల పురోగతి గురించి అడిగి తెలుసు కున్నారు. బాధితులు ఏ సమయంలో స్టేషన్‌కు వచ్చినా సమ న్యాయం అందేలా చూడాలన్నారు. బాధితులు తీసుకువచ్చే ఫిర్యాదులు పెండింగ్‌లో ఉంచొద్దన్నారు. పెండింగ్‌లో ఉంటే అందుకు సంబంధించిన సమాచారం బాధితులకు తెలియపర్చాలన్నారు. అక్రమ వ్యాపారాలు చేసే వారిపై, రౌడీలు వారి కదలికపై నిఘా ఉంచాలన్నారు. డయల్ 100 కాల్స్‌కు తక్షణమే స్పందించాలన్నారు. కార్యక్రమంలో సీఐ చంద్రశేఖర్, ఎస్సై భాగ్య లక్ష్మీరెడ్డి, ఎస్సై-2 ఆచారి, సిబ్బంది అశోక్, భాను, శ్రీకాంత్, చంద్రశేఖర్, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.