పాఠశాలల బలోపేతానికి చొరవ చూపాలి
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:38 PM
గద్వాల జిల్లా స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్‌టీయూ టీఎస్)- 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆవిష్కరించారు.

- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల న్యూటౌన్, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జోగుళాంబ గద్వాల జిల్లా స్టేట్ టీచర్స్ యూనియన్(ఎస్‌టీయూ టీఎస్)- 2025 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్టీయూ టీఎస్ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయ సంఘాలు చొరవ చూపాలని సూచించారు. నైతిక విలువలతో కూ డిన విద్యను, క్రమశిక్షణను విద్యార్థులకు అందిం చాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుర్వ హనుమంతు, కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు యూనుస్‌పాషా, పులిపాటి లక్ష్మణ్, శంకర్‌నాయక్, శ్రీహరి, కృష్ణయ్య ఉన్నారు.